హోలికా దహనం వెనుక కథ ఏంటి
హోళికా దహనం అనేది హోలీ పండుగకు ముందు రోజు జరిగే ప్రత్యేకమైన ఆచారం. ఇది పాపంపై పుణ్యం విజయం సాధించిందని, ధర్మం అధర్మాన్ని జయించిందని సూచించే గొప్ప సంప్రదాయం.
పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడి అక్క హోళికా. హిరణ్యకశిపుడు అహంకారానికి లోనైన రాక్షస రాజు. తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడిగా మారడాన్ని అంగీకరించలేక అతడిని చంపాలని నిర్ణయించుకుంటాడు. హిరణ్యకశిపుడు తన అక్క హోళికాను పిలిచి ప్రహ్లాదుని మంటల్లో కాల్చేయమని ఆదేశిస్తాడు. హోళికాకి ఒక ప్రత్యేకమైన వస్త్రం ఉండేది. ఇది ఆమెను మంటల్లో కాలిపోకుండా కాపాడుతుంది. హోళికా ప్రహ్లాదుడిని మోసగించి అతనితో పాటు అగ్నిలోకి దూకుతుంది. కాని విష్ణువు కృపతో ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు. హోళికా కాలిపోయి చనిపోతుంది. ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ హోళికా దహనం జరుపుకుంటారు