చాణక్య నీతి: మీ కష్టాన్ని వీళ్లతో మాత్రం చెప్పుకోకూడదు ఎందుకో తెలుసా?

First Published | Jan 2, 2025, 1:15 PM IST

మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే… కొందరితో మాత్రం పంచుకోకూడదట. మరి, చాణక్యుడి ప్రకారం  మన బాధలను ఎవరితో పంచుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం…

Chanakya Niti

జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కష్టాలు, బాధలు వస్తూనే ఉంటాయి. అయితే. మనకు వచ్చిన బాధను ఎవరితో ఒకరికి పంచుకోవాలి అనే ఫీలింగ్ అందరిలోనూ కలుగుతుంది. నిజానికి, కష్టాన్ని ఎవరితో అయినా పంచుకుంటే ఆ బాధలు తీరిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ, చాణక్య నీతి ప్రకారం.. మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే… కొందరితో మాత్రం పంచుకోకూడదట. మరి, చాణక్యుడి ప్రకారం  మన బాధలను ఎవరితో పంచుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం…

Chanakya Niti

1.అందరితో స్నేహంగా ఉండేవారు…
మన చుట్టూ చాలా మంది ఉంటారు. వారిలో కొందరు.. అందరితోనూ స్నేహం చేస్తారు.  ప్రతి ఒక్కరూ తమ ఫ్రెండ్స్ అనే అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి మన బాధలు, కష్టాలు చెప్పుకోకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. ఎందుకంటే.. వారికి అందరూ కావాలి. అందరితోనూ స్నేహం చేస్తారు. మీరు.. వారిని బెస్ట్ ఫ్రెండ్ అనుకొని చెప్పే సీక్రెట్స్ ని వారు ఇతరులతో పంచుకునే అవకాశం ఉంది. మీ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టేస్తారు. కాబట్టి.. వారితో పంచుకోకపోవడమే మంచిది.


Chanakya Niti

2.అసూయపడే వ్యక్తులు..


మీ పురోగతి లేదా విజయం పట్ల చాలా అసూయపడే వ్యక్తులు చాలా మంది ఉంటారు. ఇది కాకుండా, ఈ వ్యక్తులు అభద్రతాభావం తో ఉంటారు. మీ కష్టాన్ని చూసి సంతోషిస్తారు. మీ సంతోషాన్ని చూసి కుళ్లు కుంటూ ఉంటారు. చాణక్య నీతి ప్రకారం, ఈ వ్యక్తులతో తన బాధను పంచుకోకూడదు. ఈ వ్యక్తులు మీ పట్ల సానుభూతితో ఉన్నారని చూపిస్తారు కానీ వారు లోపల నుండి సంతోషంగా ఉండవచ్చు.
 

Chanakya Niti


3.అతిగా మాట్లాడేవారు…
అతిగా మాట్లాడేవారు కూడా కొందరు ఉంటారు. ఇతరుల గురించి ఏమీ అర్థం చేసుకోకుండానే మాట్లాడేస్తూ ఉంటారు. అలాంటివారికి దూరంగా ఉండాలని, వారితో ఎలాంటి విషయాలు పంచుకోకూడదు అని చాణక్యుడు చెబుతున్నాడు. ఎందుకంటే.. వీళ్లు మీ విషయాలను ఇతరులకు వక్రీకరించి చెప్పే అవకాశం ఉందట.
 

Chanakya Niti

4.స్వార్థపరులు..
ప్రపంచం మొత్తం ఎటుపోయినా సరే.. తమ గురించి మాత్రమే ఆలోచించే వారు చాలా మంది ఉన్నారు. ఈ వ్యక్తులు ఎవరినీ పట్టించుకోరు. ఎవరికైనా హాని చేయడం ద్వారా వారు ప్రయోజనం పొందినట్లయితే, ఈ వ్యక్తులు కూడా ఆ పని చేయగలరు. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ స్వభావం గల వ్యక్తులతో మీ బాధను పంచుకోకూడదు. ఈ వ్యక్తులు మీ బాధను, బాధలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.
 

Latest Videos

click me!