ఒక వ్యక్తి మరణించిన తర్వాత, వారి కర్మల ఆధారంగా స్వర్గం లేదా నరకానికి వెళతారు. గరుడ పురాణం జననం నుండి మరణం వరకు ప్రతిదీ వివరిస్తుంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఎదుర్కొనే కష్టాలు , ప్రతిఫలాలు గురించి వివరించారు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత, అంత్యక్రియలు జరిగే వరకు శరీరాన్ని ఒంటరిగా వదిలిపెట్టకూడదు.
హిందూ ధర్మంలో, శవాన్ని సాయంత్రం లేదా రాత్రి దహనం చేయకూడదు. కాబట్టి, ఒక వ్యక్తి రాత్రిపూట మరణిస్తే, ఆ వ్యక్తి శరీరాన్ని రాత్రిపూట ఇంట్లోనే ఉంచుతారు. ఒకవేళ మరణించిన వ్యక్తి కుమారులు దగ్గర లేకపోతే, వారు వచ్చే వరకు శరీరాన్ని ఇంట్లోనే ఉంచుతారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మృతదేహాన్ని ఒంటరిగా వదిలిపెట్టరు. దీనికి కారణం ఏమిటి? గరుడ పురాణం దానికి కారణాలను వివరిస్తుంది.