దాంపత్య జీవితం విజయవంతంగా సాగాలి అంటే… దంపతులు కచ్చితంగా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలట. అందులో ముఖ్యంగా.. భార్యకు సంబంధించిన విషయాలను భర్త ఇతరులు ఎవరితోనూ పంచుకోకూడదట.
భార్యభర్తల మధ్య గొడవలు రావడం సహజం. భార్యపై భర్తకు కోపం రావడం కూడా సహజమే. అయితే.. తమ మధ్య గొడవ జరిగిందని.. తనకు భార్య పై కోపం రావడానికి కారణం ఇదే అంటూ భర్త ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పకూడదట. కేవలం తన కోపాన్ని భార్యకు మాత్రమే చెప్పాలట. అందరితో చెప్పి.. ఆమెను చులకన చేయకూడదట.