Ganesh Chaturthi 2023: కొన్ని చోట్ల సెప్టెంబర్ 18 అంటే ఈ రోజు, ఇంకొన్ని చోట్ల సెప్టెబర్ 19 న వినాయక చవితిని జరుపుకోనున్నారు. ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి నాడు వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ వినాయక చవితి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లోనే కాకుండా.. ఇంటి గుడిలో కూడా వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తుంటారు. ఈ పండుగను పది రోజుల పాటు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే చాలా విగ్రహాలను పర్యావరణానికి హాని చేసే పదార్థాలతో తయారుచేస్తారు. అందుకే ఇలాంటి విగ్రహాలకు బదులుగా వేరే విగ్రహాలను ప్రతిష్టించాలని చెబుతున్నారు. మట్టి లేదా చెక్క వంటి ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను ప్రతిష్టించడం వల్ల ఎన్నో ప్రయోజనాలను కూడా పొందుతారు.
ఆవు పేడతో తయారు చేసిన విగ్రహం
ఆవు పేడతో కూడా వినాయక విగ్రహాలను తయారుచేస్తారు. నిజానికి దీనితో తయారుచేసిన వినాయకుడి విగ్రహం కూడా మీకు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను కలిగిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం.. ఆవు పేడను సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి నివాసంగా భావిస్తారు. అందుకే ఇది మన ఇంటికి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే మట్టికి బదులుగా ఆవు పేడతో చేసిన వినాయక విగ్రహాన్నిమీ ఇంట్లో ప్రతిష్ఠించొచ్చు.
చెక్క విగ్రహం..
మీరు ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకుంటే రావి, మామిడి లేదా వేప చెక్కతో చేసిన విగ్రహాన్ని కొనండి. ఎందుకంటే హిందూమతంలో ఈ చెట్లకు, మొక్కలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చెక్కతో చేసిన విగ్రహాన్ని ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పై భాగంలో ప్రతిష్టించండి. మీకు అంతా మంచే జరుగుతుంది.
చెక్క విగ్రహం..
మీరు ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకుంటే రావి, మామిడి లేదా వేప చెక్కతో చేసిన విగ్రహాన్ని కొనండి. ఎందుకంటే హిందూమతంలో ఈ చెట్లకు, మొక్కలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చెక్కతో చేసిన విగ్రహాన్ని ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పై భాగంలో ప్రతిష్టించండి. మీకు అంతా మంచే జరుగుతుంది.
పసుపు గణపతిని ఎలా తయారు చేయాలి?
పసుపుతో తయారుచేసిన వినాయక విగ్రహాన్ని కూడా ఇంట్లో ప్రతిష్టించొచ్చు. దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే ఇంట్లో పసుపుతో తయారుచేసని విగ్రహాన్ని తయారు చేసుకోవాలనుకుంటే ముందుగా పసుపును గ్రైండ్ చేసి నీరు కలిపి పిండిలా చేయండి. దీంతో వినాయకుడి విగ్రహాన్ని తయారుచేయండి.
లోహంతో తయారు చేసిన విఘ్నేషుడి విగ్రహం
వినాయక పండుగ సమయంలో లోహంతో తయారు చేసిన వినాయకుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించొచ్చు. మీ ఇంట్లో బంగారం, వెండి లేదా ఇత్తడితో చేసిన వినాయక విగ్రహాన్ని కూడా ప్రతిష్టించొచ్చు.