ఏ శుభకార్యమైనా సరే ముందుగా వినాయకుడినే పూజిస్తాం. ఎందుకంటే విఘ్నేశుడి ఆశీర్వాదం ఉంటే అంతా మంచే జరుగుతుందని నమ్మకం. అందుకే దేవతల్లో బొజ్జ గణపయ్యనే ముందుగా పూజిస్తారు. వినాయకుడిని పూజించడం వల్ల సకల బాధలన్నీ తొలగిపోయి.. సుఖ సంతోషాలు లభిస్తాయని ప్రజల నమ్మకం. కాగా ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షం నాల్గో రోజున వినాయక చతుర్థిని జరుపుకుంటారు. వినాయకుడి ఉత్సవాలను పది రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సంవత్సరం వినాయక చవితిని సెప్టెంబర్ 19 నుంచి ఈ నెల 28 వరకు జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా వినాయకుడి గురించి అతని పుట్టుక గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం..
1. హిందూ క్యాలెండర్ ప్రకారం.. వినాయక చవితి భద్రపదంలో శుక్ల చతుర్థి నుంచి మొదలవుతుంది.
2. కేవలం భారతదేశంలోనే కాదు కంబోడియా, థాయ్ లాండ్, ఆఫ్టనిస్తాన్, ఇండోనేషియా, చైనా, నేపాల్ వంటి దేశాల్లో కూడా వినాయకుడిని పూజిస్తారు.
3. వినాయకుడికి మోదకాలంటే ఎంతో ఇష్టం. ఇది అందరికీ తెలుసు. కానీ పురాన్ పోలీ కూడా వినాయకుడికి సమర్పిస్తారు. మోదకాలతో పాటుగా పూరన్ పోలీలను కూడా ప్రసాదంగా భావిస్తారు. ఈ రెండింతో పాటుగా వినాయకుడికి సమర్పించే మరో స్వీట్ కరంజీ.
4. బొజ్జ గణపయ్య పుట్టక గురించి రెండు వేర్వేరు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి.. పార్వతీ దేవి స్నానం చేస్తుండగా.. తన ఒంటికి అంటుకున్న పసుపుతో విానయకుడిని పుట్టిస్తుంది. అయితే ఆమె స్నానం అయిపోయే వరకు గుమ్మం దగ్గర కాపాలాగా ఉండమని చెప్పిందట. అదే సమయంలో బయటకు వెళ్లిన పరమేశ్వరుడికి వినాయకుడి గురించి తెలియదు. దీంతో శివుడు గుమ్మంలోకి వస్తుంటే అక్కడే ఉన్న వినాయకుడు లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆవేశంతో శివుడు వినాయకుడి తల నరికేస్తాడు. ఇది చూసిన పార్వతీ దేవికి పట్టరాని కోపం వస్తుంది. దీంతో శివుడు వినాయకుడు మళ్లీ బతికేలా చేస్తానని వాగ్దానం చేస్తాడు. చనిపోయిన వ్యక్తికి ఉత్తరం వైపున్న ఏదైనా జీవి తలను తీసుకురావడానికి శివుడు బయలుదేరుతారు. కానీ అటువైపు ఒక్క ఏనుగు మాత్రమే ఉంటుంది. దీంతో శివుడికి వేరే మార్గం లేక విఘ్నేషుడిని బతికించడానికి ఏనుగు తలను తీసుకొస్తాడు. మరో పురాణం ప్రకారం..దేవతల అభ్యర్థన మేరకు శివపార్వతులిద్దరు వినాయకుడిని సృష్టించారు. దేవతలకు సాయం చేయడానికి వినాయకుడిని సృష్టించారని చెప్తారు.
5. వినాయకుడు బ్రహ్మచారి అని చాలా మంది అనుకుంటారు. నిజమేంటంటే.. విఘ్నేషుడికి రిధి, సిద్ధి అనే ఇద్దరు భార్యలున్నారు.
6. మొట్ట మొదట వినాయక చతుర్థిని ఛత్రపతి శివాజీ మహారాజు కాలంలో జరుపుకున్నారట. ఈ పండుగను పేష్వాలు జరుపుకున్నారట. అయితే పేష్వాల పతనం తర్వాత 1893 లో స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ ఈ పండును సెలబ్రేట్ చేశారు.
ganesh chaturth
7. వినాయక చతుర్థి సమయంలో రుగ్వేదంలోని వేద శ్లోకాలు, గణపతి అధర్వ శిర్ష ఉపనిషత్తు, నారద పురాణంలోని వినాయక స్తోత్రం జపిస్తారు.
8. దేవతలందరిలో కెల్లా వినాయకుడినే ముందుగా పూజిస్తారని వినాయకుడికి పరమేశ్వరుడు వరం ఇచ్చాడని నమ్మకం. ఈయన అందరికంటే గొప్పవాడని నమ్ముతారు.
9. వినాయక చవితి సమయంలో వినాయకుడి 108 నామాలను పఠిస్తే అంతా శుభమే జరుగుతుందని నమ్ముతారు.