వినాయక చవితి శుభముహూర్తం ఇదే.. వినాయకుడిని ఇలా పూజిస్తే మీ బాధలన్నీ మాయం..!

First Published | Sep 5, 2023, 11:52 AM IST

ganesh chaturthi 2023: వినాయకుడిని పూజించడం వల్ల ఇంట్లోని ప్రతికూల ప్రభావాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. అలాగే మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
 

వినాయక చవితికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వినాయక చవితి రోజు ఉపవాసం ఉండేవారు కూడా చాలా మందే ఉన్నారు. ఈ రోజున గణపయ్యను పూజించడం వల్ల సకల బాధల నుంచి విముక్తి పొందుతారని నమ్మకం. శాస్త్రాల ప్రకారం.. శుక్లపక్షంలో వినాయక చవితి వస్తుంది. ఈ రోజున ఆయన భక్తులు వినాయకుడికి ఉపవాసం ఉండి నిష్టగా పూజిస్తారు. దీనివల్ల ఇంట్లో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే మీ ఆదాయం పెరుగుతుంది.  అదృష్టం వరిస్తుంది.

వినాయక చతుర్థి తేదీ, సమయం

చతుర్థి తిథి ప్రారంభం - ఆగస్టు 19, 2023 - 10:19 PM
చతుర్థి తిథి ముగింపు - ఆగస్టు 21, 2023 -12:21 AM
 

Latest Videos


ganesh chaturthi 2022

పూజా విధి

వినాయక చవితి రోజున ఉదయాన్నే నిద్రలేచి ముందుగా స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ తర్వాత  రాగి కమలంతో సూర్యభగవానుడికి నైవేద్యాలు సమర్పించాలి. వినాయకుడిని పండు, పూలు, ధూపదీపాలు, గంధం మొదలైన వాటితో పూజించాలి. వినాయకుడికి పసుపు పువ్వు దుర్వ, మోదక్ అంటే చాలా ఇష్టం. కాబట్టి పూజలో పసుపు పువ్వులు, దుర్వా, మోదక్ లను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల గణేషుడి అనుగ్రహం మీపై ఉంటుంది.

ganesh chaturthi 2023

అలాగే పూజ సమయంలో వినాకుడి చాలీసా పఠించాలి. మంత్రాలను పఠించాలి. చివర్లో వినాయకుడికి హారతి ఇచ్చి ప్రదక్షిణలు చేయాలి. దేవుడికి దండం పెట్టుకుని ఇంట్లో సంతోషం, శాంతి, సంపదల కోసం ప్రార్థించాలి. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం హారతి తర్వాత పండ్లను తినండి. 
 

ganesh chaturthi 2023

కృష్ణ పక్షం చతుర్థి తేదీని వినాయక చవితి అని పిలుస్తారు. సంకష్ట చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వల్ల సకల బాధలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించడం వల్ల ఇంట్లోని ప్రతికూల ప్రభావాలు తొలగిపోయి శాంతి నెలకొంటుంది. వినాయకుడు ఇంట్లోకి వచ్చి ఆపదలన్నింటినీ తొలగిస్తాడని నమ్మకం. అలాగే మన కోర్కెలన్నింటినీ నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు. 

click me!