సనాతన ధర్మంలో వినాయకుడు మొదటి ఆరాధకుడు. అందుకే మనం ఏ శుభకార్యం చేసినా ఆయన పూజతోనే మొదలుపెడతాం. వినాయకుడిని మొదట పూజిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్మకం. వినాయకుడు తన భక్తులకు ఎలాంటి కష్టాలను రానీయని జ్యోతిష్యులు చెబుతున్నారు. కాగా ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షం నాల్గో రోజున వినాయక చవితిని జరుపుకుంటారు. 10 రోజుల పాటు సాగే ఈ వినాయక ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏడాది వినాయక ఉత్సవాలు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 28న ముగుస్తాయి. ఈ నెల 28న వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.
Vinayaki Chaturthi 2023
పురాణాల ప్రకారం.. ఈ 10 రోజులు బొజ్జ గణపయ్య తన ఇంటి నుంచి అంటే కైలాస పర్వతం నుంచి భూలోకంలోకి వస్తాడు. అయితే ఈ పండుగ రోజున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లోనే కాదు ఇంట్లో కూడా గణేష విగ్రహాన్ని ప్రతిష్టిస్తుంటారు. మీరు కూడా గణపయ్యను ఇంట్లో ప్రతిష్టించాలనుకుంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అవేంటంటే?
Sankashti Chaturthi 2023
వినాయకుడి విగ్రహాలు ఎన్ని ఉంచాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం.. వినాయక చవితినాడు గణపయ్యను మీ ఇంట్లోకి ఆహ్వానించాలనుకుంటే.. మీ ఇంట్లో ఒక విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టించాలని గుర్తుంచుకోండి. ఒకటి కంటే ఎక్కువ వినాయక విగ్రహాలను ప్రతిష్టించడం వల్ల శుభఫలం ముగిసి వినాయకుడికి కోపం వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
sawan chaturthi 2023
అయితే మీ ఇంట్లో ప్రతిష్టించాలనుకునే వినాయకుడి విగ్రహం విగ్రహం చేతిలో గణపతి మోక, మోదకం ఖచ్చితంగా ఉండాలి. దీనితో పాటుగా అతని విగ్రహం ఎడమ వైపు ఉండేలా చూసుకోండి. దీన్ని మరింత పవిత్రంగా భావించి.. బొజ్జ గణపయ్య మీపై ఆయన అనుగ్రహాన్ని ప్రసాధిస్తాడు.
మీరు ఇంట్లో గణపయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకుంటే.. ముందుగా శుభ్రమైన ఎరుపు గుడ్డను కొనండి. దీన్ని వినాయకుడిని ప్రతిష్టించే ప్రదేశంలో వేదికపై పరచండి. ఈ ఎరుపు ఆసనం ఆనందం, శ్రేయస్సును కలిగిస్తాయి. ఆ తర్వాత దీనిపై వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించండి.