వినాయక చవితి రోజు పాటించాల్సిన ఆచారాలు ఇవి..

First Published | Sep 5, 2023, 10:33 AM IST

Ganesh Chaturthi 2023: ఈ ఏడాది వినాయక చవితి పండుగను ఈ నెల 19 న జరుపుకోబోతున్నాం. ఈ పండుగను 10 రోజుల పాటు జరుపుకుంటారు. మరి ఈ పండుగ సందర్భంగా పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వినాయక చవితి ఎంతో పవిత్రమైన పండుగ. లంబోధరుడి జననాన్ని గుర్తు చేసే 10 రోజుల పండుగ వినాయక చవితి. ఈ పండుగను ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరుపుకోనున్నాం. వినాయక చవితి రోజు ఏం చేయాలి? ఎలాంటి ఆచారాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

వినాయక చతుర్థి నాడు నాలుగు ప్రాధమిక ఆచారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే? 

1. పండుగ మొదటి రోజున పూజారి మంత్రాలు పఠించి పూజలు చేస్తాడు. 

2. మొదటి రోజు నిర్వహించే ఈ ఆచారంలో వినాయకుడికి 16 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ నైవేద్యాలలో పువ్వులు, పండ్లు, స్వీట్లు, ధూప, దీపాలు, నీరు ఉంటాయి. 

3. పండుగ 10 వ రోజున ఈ ఆచారం వినాయకుడికి వీడ్కోలు పలుకుతుంది. పూజారి మంత్రాలు పఠించి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన ఆశీర్వాదం పొందడానికి పూజలు చేస్తాడు.

4. వినాయక నిమజ్జనం: 10 వ రోజున ఈ ఆచారంలో వినాయక విగ్రహాన్ని నది లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు. ఇది పండుగ ముగింపు. అలాగే వినాయకుడు తన ఖగోళ నివాసానికి తిరిగి రావడాన్ని సూచిస్తుంది.


వినాయక చవితి పండుగ వేడుకలను ప్రారంభించడానికి మీ ఇంటిని, వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రాంతాన్ని శుభ్రపరచాలి. ఆ తర్వాత పూజకు అవసరమైన అన్ని వస్తువులను తేవాలి. ఇందులో వినాయకుడి మట్టి విగ్రహం, పూలు, ధూపం, దీపాలు, పండ్లు, స్వీట్లు, సంప్రదాయ పూజా సామాగ్రీలు ఉంటాయి. 
 


విగ్రహ ప్రతిష్ఠాపన

విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన ప్రదేశంలో శుభ్రమైన వస్త్రం లేదా అలంకరణ వేదికను ఏర్పాటు చేయాలి. వేదికపై వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. 

వినాయక చవితి ఆచారాలు

వినాయక చవితి రోజున పూజ సమయంలో షోడశోపచార పూజ అని పిలువబడే మొత్తం పదహారు ఆచారాలను అనుసరించి వినాయకుడిని భక్తితో పూజించాలి. ఈ ఆచారాలతో పాటుగా పురాణ మంత్రాల పఠనం కూడా జరుగుతుంది. ఈ పదహారు దశలు ఆరాధన వివిధ అంశాలను కలిగి ఉంటాయి.
 

ganesh chaturthi 2023

వినాయక చవితి ఉపవాస నియమాలు

వినాయక చవితి నాడు ఉపవాసం ఉన్నవారు ప్రక్షాళన స్నానంతో రోజును ప్రారంభించాలిని జ్యోతిష్యులు చెబుతున్నారు.  ఈ ఉపవాసం తెల్లవారుజాము నుంచి చంద్రోదయం వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ప్రతిరోజూ ఒక సాత్విక భోజనం తినాలని సిఫార్సు చేయబడింది. ఈ భోజనంలో పండ్లు, పాలు, ఉప ఉత్పత్తులు, పండ్ల రసం, ఖీర్ వంటివి ఉండొచ్చు.

Latest Videos

click me!