కృష్ణాష్టమి 2023: మీ కలలో శ్రీకృష్ణుడిని చూశారా?దాని అర్థమేంటో తెలుసా?

First Published | Sep 5, 2023, 9:43 AM IST

krishna janmashtami 2023: సృష్టికర్త శ్రీకృష్ణుడికి వేణువు అంటే చాలా చాలా ఇష్టం. కలలో శ్రీకృష్ణుడు వేణువు వాయించడం చూస్తే మీకు అంతా శుభమే జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ కలగంటే రాబోయే కాలంలో మీకు అపారమైన సంపదను పొందే అవకాశం ఉంది. అలాగే మీ ఆనందం, ఆదాయం కూడా పెరుగుతాయి.
 

Janmashtami 2023

కలలు రాబోయే భవిష్యత్తుకు సంకేతం. కొన్ని కలలు శుభ సంకేతాలను చూపిస్తాయి. ఇంకొన్ని అశుభాలను సూచిస్తాయి. మంచి కలను చూసి ప్రజలు సంతోషిస్తున్నారు. చెడు కలలను కనడం వల్ల జనాలు తెగ  భయపడతారు. కొన్ని ఆనందపడే కలలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి శ్రీకృష్ణుని దర్శనం.  అవును మీరు కలలో శ్రీకృష్ణుడిని, అతనికి సంబంధించిన విషయాలను చూసినట్టైతే మీ భవితవ్యం త్వరలో మారబోతోందని అర్థం. ఈ కలల గురించి వివరంగా తెలుసుకుందాం.
 

Janmashtami

శ్రీకృష్ణుడికి వేణువు అంటే ఎంతో ఇష్టం. మీ కలలో శ్రీకృష్ణుడు వేణువు వాయించడం చూస్తున్నట్టతే.. ఇవి శుభ సంకేతాలని జ్యోతిష్యులు అంటున్నారు. ఈ కలగంటే మీరు రాబోయే కాలంలో అపారమైన సంపదను పొందుతారని అర్థం. అలాగే మీ సంతోషం, అదృష్టం కూడా పెరుగుతాయి. ఈ కల అంటే మురళీ మనోహరుడు మీతో సంతోషంగా ఉన్నాడని అర్థం. ఆయన అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం.


janmashtami 2023 upay

కలలో శ్రీకృష్ణుడు లేదా గోపాలుడిని చూడటం ఎంతో శుభప్రదమని డ్రీమ్ సైన్స్ నిపుణులు అంటున్నారు. ఈ కల మీ జీవితంలో ఏదో గొప్పది జరగబోతోందని అర్థం. మీ ఆదాయం, అదృష్టం పెరుగుతాయి. మీరు మీ జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధించగలరు. సింపుల్ గా చెప్పాలంటే మీ అదృష్టం పెరుగుతుంది.
 

janmashtami 2023 upay

బాల గోపాలుడు కలలో అన్నం పెట్టడం కూడా శుభప్రదం. ఈ కల అంటే కృష్ణయ్య అనుగ్రహం మీపై పడిందని అర్థం. ఆయన అనుగ్రహంతో మీ కోరికలన్నీ వీలైనంత త్వరగా నెరవేరుతాయి. అనుకున్నది సాధించగలుగుతారు.

Latest Videos

click me!