నాల్గో రోజు: వినాయకుడికి నైవేద్యంగా అరటి పండ్లను సమర్పించడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందుకే వీటిని కూడా వినాయకుడికి సమర్పించండి.
ఐదో రోజు: జ్యోతిష్యుల ప్రకారం.. విఘ్నేషుడికి మఖనా ఖీర్ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఐదో రోజున బొజ్జ గణపయ్యకు మఖానా ఖీర్ ను సమర్పించండి.
ఆరో రోజు: హిందూ మతంలో కొబ్బరిని పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే పూజ సమయంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. కొబ్బరి కాయను దేవుడి ముందు కొట్టి దాన్ని ప్రసాదంగా పంచి పెడుతారు. అందుకే ఆరో రోజున బొప్పాకు దీన్ని సమర్పించొచ్చు.