Ganesh Chaturthi 2023: భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండుగల్లో వినాయక చవితి ఒకటి. వినాయకుడు అడ్డంకులను తొలగించేదేవుడుగా ఎంతో ప్రసిద్ధి చెందాడు. అందుకే ఏ పండగైనా, శుభకార్యమైనా వినాయకుడికే ముందు పూజ చేస్తారు. వినాయకుడి ఆశీస్సులు ఉంటే ఏ పనైనా సక్రమంగా జరుగుతుందని నమ్ముతారు. అందుకే వినాయకుడిని పూజించకుండా ఏ శుభకార్యం సంపూర్ణం కాదు. ఇంట్లోని ప్రతికూలతలన్నింటినీ వినాయకుడు తొలగిస్తాడని కూడా నమ్ముతారు. అయితే వినాయకుడి విగ్రహాన్ని సరైన మార్గంలో ఉంచితే తప్ప ఇది సాధ్యం కాదంటున్నారు జ్యోతిష్యులు. మరి వినాయకుడి విగ్రహాన్ని తీసుకొచ్చే ముందు ఎలాంటి నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తు ఇంటికి ఎలాంటి విగ్రహాలను తీసుకురావాలి?
ఆవు పేడ, వేపచెట్టు, మర్రిచెట్టు తో చేసిన వినాయకుడి విగ్రహాలను ఇంటికి తేవడం వల్ల అదృష్టం పెరుగుతుంది. దురదృష్టం తొలగిపోతుంది.
పసుపు, తెలుపు వినాయక విగ్రహాలు మీ అదృష్టాన్ని పెంచుతాయి. సిరి సంపదలను కలిగిస్తాయి.
స్ఫటిక వినాయక విగ్రహాలను ఇంటికి తీసుకురావడం వల్ల మీకున్న అన్ని వాస్తు దోషాలు తొలగిపోతాయి.
వెండి వినాయక విగ్రహాన్ని తీసుకురావడం వల్ల మీ కీర్తి పెరుగుతుంది.
ఇత్తడి వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకువాడం వల్ల మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.
చెక్క వినాయకుడి విగ్రహాన్ని తీసుకురావడం వల్ల మీ సంతోసం పెరుగుతుంది.
విగ్రహాన్ని ఉంచడానికి సరైన ప్రదేశం?
వినాయక విగ్రహాలను ఎప్పుడూ కూడా తూర్పు, పడమర లేదా ఈశాన్య దిశలోనే ఉంచాలి. విగ్రహాన్ని దక్షిణ దిశలో లేదా మరుగుదొడ్డికి నేరుగా ఉన్న గోడకు లేదా మరుగుదొడ్డి సమీపంలో ఉంచకూడదు. అలాగే విగ్రహాన్ని మెట్ల కింద పెట్టడం కూడా మంచిది కాదు.
వినాయకుని తొండం స్థానం?
వాస్తు శాస్త్రం ప్రకారం.. వినాయకుడి తొండం కొద్దిగా ఎడమ వైపుకు వంగి ఉండాలి. ఎందుకంటే ఇది ఇంట్లో సానుకూలతను తెస్తుందని నమ్ముతారు.
ఒకవేళ మీరు మీ ఆఫీసు డెస్క్ పై వినాయకుడి విగ్రహాన్ని పెట్టాలనుకుంటే విగ్రహం నిలబడి ఉన్న స్థితిలో ఉందని నిర్ధారించుకోండి. ఎందుకంటే ఇలాంటి విగ్రహం సానుకూల శక్తిని తెస్తుంది. అలాగే మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.
ఇంట్లో వినాయక విగ్రహం స్థానం?
మీరు ఇంటికి తీసుకువచ్చే వినాయక విగ్రహం కూర్చున్న భంగిమలో ఉండేలా చూసుకోండి.