వినాయకుడిని నిమజ్జనం చేయడానికి శుభ సమయం ఇదే..!

First Published | Sep 25, 2023, 3:46 PM IST

Ganesh Chaturthi 2023: పరమేశ్వరుడి కుమారుడైన వినాయకుడు భద్ర మాసంలోని శుక్లపక్షం చతుర్థి రోజున పుట్టాడని సనాతన శాస్త్రాలలో పేర్కొనబడింది. అందుకే ఈ రోజు నుంచి అనంత చతుర్దశి తిథి వరకు వినాయకుడిని పూజించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు. 
 

Image: Getty Images

Ganesh Chaturthi 2023: ప్రతి ఏడాది  భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్దశి రోజున అనంత చతుర్ధశిని జరుపుకుంటారు. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 28 అనంత చతుర్దశిని జరుపుకోబోతున్నాం. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. అలాగే వినాయక నిమజ్జన కూడా చేస్తారు. భద్ర మాసంలోని శుక్లపక్ష చతుర్థి రోజున వినాయకుడు భూమికి మీదికి వచ్చాడని సనాతన గ్రంథాల్లో నమ్మకం. అందుకే ఈ రోజు నుంచి అనంత చతుర్దశి తిథి వరకు వినాయకుడిని పూజిస్తారు. అలాగే అనంత చతుర్దశి తిథి నాడు వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. మరి వినాయకుడిని ఏ సమయంలో నిమజ్జనం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Image: Getty Images

శుభ సమయం

జ్యోతిష్యం ప్రకారం.. భాద్రపద మాసంలోని చతుర్దశి తిథి సెప్టెంబర్ 27 న రాత్రి 10.18 నుంచి సెప్టెంబర్ 28 సాయంత్రం 06.49 వరకు ఉంటుంది. ఈ రోజు మీరు ఏ సమయంలోనైనా విష్ణువును, వినాయకుడిని పూజించొచ్చు. దీనివల్ల మీ సకల బాధలన్నీ తొలగిపోతాయి. 
 


ganesh visarjan 2023

గణేష్ నిమజ్జనానికి శుభ సమయం

అనంత చతుర్దశి నాడు వినాయకుడిని నిమజ్జనానికి మంచి సమయం ఉదయం 06:12 నుంచి 07:42 వరకు ఉంటుంది. ఆ తర్వాత సమయం ఉదయం 10.42 గంటల నుంచి మధ్యాహ్నం 03.11 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయొచ్చు. 

ganesh visarjan 2023


అనంత చతుర్దశి నాడు రాహు కాలము

అనంత చతుర్దశి తిథి నాడు రాహు కాలం మధ్యాహ్నం 01:42 నుంచి 03:11 వరకు ఉంటుంది.

సాయంత్రం శుభ సమయం

వినాయకుడిని నిమజ్జన శుభ సమయం ఉదయం 06.11 గంటల నుంచి రాత్రి 09.12 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో వినాయకుడి విగ్రహాన్ని కూడా నిమజ్జనం చేయొచ్చు. అలాగే అర్ధరాత్రి 12.12 గంటల నుంచి మధ్యాహ్నం 01.42 గంటల వరకు బహిరంగ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఉంది. ఈ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయొచ్చు.

Latest Videos

click me!