ganesh chaturthi 2023
వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ఆచారాలతో పూజించడం వల్ల ఆనందం, శ్రేయస్సు, సంపద కలుగుతాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి. అయితే దేవుళ్లు, దేవతలు ఎన్నో అవతారాలు ఎత్తుతుంటారు. అలాగే వినాయకుడుదు కూడా ఎంతో మంది రాక్షసులను సంహరించడానికి ఎన్నో అవతారాలు ఎత్తాడు. వినాయకుడి 8 అవతారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఏకదంత అవతారం
వినాయకుడికి ఒక దంతం మాత్రమే పూర్తిగా ఉంటుంది. మరొకటి విరిగిపోయి కొంచెం మాత్రమే ఉంటుంది. అందుకే ఈయనను ఏకదంతుడు అని పిలుస్తారు. ఈ అవతారంలో వినాయకుడు దేవతలను మాదాసురుడు అనే రాక్షసుని కోపము నుంచి విముక్తులను చేసాడు. ఏ విధమైన మత్తుకైనా సరే దూరంగా ఉండాలని ఈ వినాయకుని అవతారం మనకు బోధిస్తుంది.
ganesh chaturthi 2023
2. దూమ్రవర్ణుడు
అహంకాసురుడిని సంహరించడానికి వినాయకుడు ఈ అవతారం ఎత్తుతాడు. ఈ అవతారంలో వినాయకుడి రంగు పొగలా ఉంటుంది. అందుకే దీనిని ధూమ్రవాణావతారం అంటారు. అహంకాసురుడు అహంకారానికి ప్రతీక. అందుకే వినాయకుడి ఈ అవతారం అహంకారం నుంచి విముక్తికి మార్గాన్ని చూపుతుంది.
ganesh chaturthi 2023
3.లంబోదరుడు అవతారం
లంబోదరుడు అంటే పొడవైన లేదా పెద్ద కడుపు ఉన్నవాడని అర్థం. వినాయకుడు మనోహరసురుడిని సంహరించడానికి లంబోదరుడి అవతారం ఎత్తుతాడు. ఈ విధంగా వినాయకుడిని పూజించడం ద్వారా ఒక వ్యక్తి కోపాన్ని కూడా వదిలించుకోవచ్చు.
4. మహోదరుడు అవతారం
మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఓడించి స్వర్గాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. దీంతో విఘ్నహర్త అయిన వినాయకుడు మహోదరుడు అవతారం ఎత్తవల్సి వస్తుంది. ఈ రూపంలో వినాయకుడు మహిషాసురుడిని వధించాడు. ఇక్కడ మహిషాసురుడి వధ విముక్తికి చిహ్నం.
5. వక్రదంతుడు
మత్సర్యసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి వినాయకుడు వక్రతుండ అవతారం ఎత్తుతాడు. మత్సర్యసురుడు అంటే ఇతరుల ఆనందాన్ని చూసిన రగిలిపోవడం. అయితే ఈ వినాయక అవతారం ఈ దుర్గుణం నుంచి విముక్తి సందేశాన్ని ఇస్తుంది.
6. వికటుడు
వినాయకుడు భీకర అవతారం ఎత్తి కామసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. ఈ రూపంలో వినాయకుడు నెమలిపై కూర్చుంటాడు. ఈ వినాయకుడి అవతారం మనకు కామం నుంచి విముక్తికి మార్గాన్ని చూపుతుంది.
7. గజానన అవతారం
ఈ అవతారంలో గణేశుడు లోభాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. లోభం అంటే దురాశ. చాలాసార్లు అత్యాశ వల్ల మనిషి తనకు తానే హాని చేసుకుంటాడు. అందుకే గజానన అవతారం మనకు దురాశ నుంచి విముక్తి సందేశాన్ని ఇస్తుంది.
ganesh chaturthi 2023
8. విఘ్నరాజు అవతారం
మామతాసురుడిని సంహరించడానికి వినాయకుడు విఘ్నరాజు అవతారం ఎత్తాడు. ఈ అవతారంలో వినాయకుడి వాహనంగా సింహం ఉంటుంది. పార్వతీ దేవి నవ్వు నుంచి మమతాసురుడు జన్మించాడు.