గణేష్ చతుర్థి 2022: ఈ సంవత్సరం.. ఈ రాశులవారిపై గణేషుని అనుగ్రహం..!

First Published | Aug 25, 2022, 2:02 PM IST

గణేశుడిని ఆరాధించడం వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని రకాల పనులు విజయవంతం అవుతాయని, భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.

వినాయక చవితి... ఈ పండగను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరేమో. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఈ పండగను జరుపుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. కాగా.. ఈ ఏడాది గణేష్ చతుర్థి ఆగస్టు 31వ తేదీన జరుపుకుంటున్నాం. హిందూ క్యాలెండర్ ప్రకారం, గణేష్ చతుర్థి పండుగను భాద్రపద మాసంలో శుక్ల పక్షం నాల్గవ రోజున జరుపుకుంటారు. 
 

హిందూ మతంలో మొదటిగా పూజించే దేవుడు గణపతి. ఏ విధమైన శుభకార్యమైనా లేదా ఏదైనా శుభప్రదమైన లేదా మతపరమైన ఆచారాలను నిర్వహిస్తున్నప్పుడు, ముందుగా గణేశుడిని పూజిస్తారు. ఆ తర్వాత మాత్రమే ఇతర ఆరాధనలు ప్రారంభమవుతాయి. గణేశుడిని ఆరాధించడం వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని రకాల పనులు విజయవంతం అవుతాయని, భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.

Latest Videos


కాగా... ఈ ఏడాది.. వినాయకుని అనుగ్రహం..మూడు రాశులవారికి చాలా ఎక్కువగా ఉందట. వారికి ఈ ఏడాది అదృష్టం కలిసి రానుందట. మరి  ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..

మకర రాశి...
 గణేశుడి ప్రత్యేక అనుగ్రహం మకరరాశి వారిపై ఎప్పుడూ ఉంటుంది. మకరరాశి వారు స్వతంత్ర మనస్తత్వం కలిగి ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. వారు తమ పనిలో ఎప్పుడూ ఓడిపోరు. మకర రాశి అంటే గణేశుడికే కాదు శనికి కూడా ఇష్టం. ఎందుకంటే ఇది శని స్వరాశి. కాబట్టి ఈ రాశి వారికి అదృష్టం ఎప్పుడూ ఉంటుంది. అతను ఎల్లప్పుడూ తన ప్రయత్నాల ప్రకారం మంచి ఫలితాలను పొందుతాడు. పనిలో ఎల్లప్పుడూ విజయం ఉంటుంది. ఈ రాశిచక్రం వ్యక్తులు వారి తెలివితేటలు ,నైపుణ్యం  తో ఎలాంటి సవాళ్లు స్వీకరించడానికైనా ముందుంటారు.  మకరరాశి వారికి వినాయకుని విశేష అనుగ్రహం వల్ల వారి పనుల్లో ఆటంకాలు త్వరగా తొలగిపోతాయి. మీరు బుధవారం నాడు వినాయకుడికి లడ్డూలను నైవేద్యంగా పెడితే శుభప్రదంగా భావిస్తారు. దీని ద్వారా గణేశుడి విశేష ఆశీస్సులు కలకాలం నిలిచి ఉంటాయి.

మేషరాశి..
మేషరాశి వారిపై గణేశుడి ప్రత్యేక అనుగ్రహం, ఆశీస్సులు ఉంటాయి. కుజుడు మేష రాశికి అధిపతి. కుజుడు ధైర్యం, బలం, శౌర్యం , ధైర్యసాహసాలకు సంకేతం. గణపతి ప్రత్యేక అనుగ్రహం వల్ల ఈ రాశివారి పనులన్నీ త్వరితగతిన పూర్తిచేసి మంచి ఫలితాలు పొందుతారు. బుధవారం నాడు వినాయకుడికి ఎర్రటి పువ్వులు సమర్పించడం వల్ల విశేష అనుగ్రహం కలుగుతుంది.

మిధునరాశి
మిథున రాశివారిపై కూడా వినాయకుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది.  జ్యోతిషశాస్త్రంలో... బుధుడు వ్యాపారం, గణితం, తర్కం, కమ్యూనికేషన్ ,మేధస్సు  అంశంగా పరిగణిస్తారు. వినాయకుని కూడా బుధవారం ఇష్టమైన రోజు. శివుని కుమారుడైన గణేశుడు ఈ రాశి వారికి శీఘ్ర ఫలితాలను ఇస్తాడు. వ్యాపారం చేసే వ్యక్తులపై వినాయకుడికి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ఈ రాశి వారికి గణేశుని ఆశీస్సులు ఉండటం వల్ల పనులు త్వరితగతిన పూర్తి చేసి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. బుధవారం నాడు గణేశుడికి సింధూరం సమర్పించడం వల్ల జీవితంలో శుభం కలుగుతుంది.

click me!