దుష్కర్మలను తరిమికొట్టే ఐడియాలు ఇవి...!

First Published | Sep 19, 2022, 10:18 AM IST

జీవితంలో ఏది చేద్దామన్నా, జీవితంలో ఏది సాదిద్దామని అన్నా చాలా మందికి ఏదో  వెనక్కి లాగేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. దానికి మీ దుష్కర్మే బాధ్యత అని మీరు భావిస్తే.... ఆ దుష్కర్మను ఈ పనులతో దూరం చేసుకోవచ్చు.

meditation

ఈ ప్రపంచం మొత్తం కర్మ సిద్దాంతం ప్రకారమే జరుగుతుంది. మన కర్మలకు మనమే కర్తలం. మనం చేసే పనులే మన కర్మ ఎలాం ఉండాలి అనేది డిసైడ్ చేస్తుంది. అయితే... చాలా మంది తమకు జరిగే కొన్ని విషయాలను కర్మ పై తోసేస్తారు. నిజంగా మీకు చెడు కర్మ మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది అంటే ఆ కర్మను మనమే మార్చుకోవచ్చట. అదెలాగో ఓసారి చూద్దాం...

spiritual

జీవితంలో ఏది చేద్దామన్నా, జీవితంలో ఏది సాదిద్దామని అన్నా చాలా మందికి ఏదో  వెనక్కి లాగేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. దానికి మీ దుష్కర్మే బాధ్యత అని మీరు భావిస్తే.... ఆ దుష్కర్మను ఈ పనులతో దూరం చేసుకోవచ్చు.


1.మీ దుష్కర్మలు... మిమ్మల్ని ఎలాంటి అవాంఛిత పరిస్థితులలో లాక్ చేస్తున్నాయని ముందుగా గుర్తించాలి. జీవితం ఎక్కడ స్తబ్దుగా మారుతుందో ముందు గమనించాలి. అడ్డంకులను తొలగించుకోవడం సులభమౌతుంది. 

2.చాలా మందికి తమను తాము మార్చుకోవాలని ఉంటుంది. కానీ... చుట్టూ ఉన్న కొందరు వారికి మారే అవకాశం ఇవ్వరు. ముందు... అలాంటి టాక్సిక్ పీపుల్ ని ముందు దూరం పెట్టాలి. వాళ్లను దూరం పెట్టడం వల్ల మీకు కాస్త ఊరట లభిస్తుంది. కాస్త ఒత్తిడి తగ్గి మీరు మంచివైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది.

3.ఒక్కసారి మనం మారాలి అనుకున్న తర్వాత... మనం గతంలో చేసిన తప్పులు కచ్చితంగా గుర్తుకు వస్తాయి. అయితే..  ఆ తప్పుల గురించి ఆలోచిస్తూ బాధపడకూడదు. ఆ తప్పుల నుంచి నేర్చుకోవాలి. ఆ తప్పులను నేర్చుకోవడం వల్ల ముందు పాజిటివిటీ పెరుగుతుంది. మరోసారి ఆ తప్పులు చేయకుండా ఉండగలుగుతారు.

Spirituality

4.చాలా మంది తాము ఓడిపోవడానికి చాలా కారణాలు చెబుతూ ఉంటారు. తమకు ఉన్న బలహీనతల కారణంగా సాధించలేకపోతున్నామని భావిస్తూ ఉంటారు. అయితే... మీ ఓటమి కారణమౌతున్న బలహీనతలను మీరు జయించాలి. అప్పుడే విజయం సాధించగలరు.

spiritual

5. కొందరు చెబుతారు.. తాము చాలా సార్లు  ప్రయత్నించామని కానీ... సాధించలేకపోయామని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ.. మీరు ప్రయత్నిస్తున్న మార్గాన్ని మార్చుకోవాలి. మీరు ప్రయత్నిస్తున్న పాత మార్గాన్ని పక్కన పెట్టి.... కొత్త మార్గంలో ప్రయత్నించాలి.

6.దుష్కర్మ ఎక్కువగా ఉంటే.. మనకు ఇతరులపై ద్వేషం ఎక్కువగా ఉంటుంది. ఈ ద్వేషం మనకు శత్రువులాంటిది. మీ నుంచి దుష్కర్మను దూరం చేసుకోవాలి అంటే... ముందుగా... మనకు ఎంత ద్రోహం చేసినా.. వారిని క్షమించడం అలవాటు చేసుకోవాలి.
 

Latest Videos

click me!