దసరా 2023: రాక్షసుడైనా రావణుడిని ఎందుకు గౌరవిస్తారో తెలుసా?

First Published | Oct 24, 2023, 10:33 AM IST

dussehra 2023: రావణాసురుడిని చెడ్డవాడిగానే చూస్తారు. అలాగే భావించే వారు చాలా మందే ఉన్నారు. అందుకు విజయదశమి నాడు రావణాసుడి దిష్టి బొమ్మను తయారుచేసి దహనం చేస్తారు. రావణాసురుడు రాక్షసుడే అయినప్పటికీ.. ఇతనికి కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయట. రావణాసురుడిని చాలా ప్రదేశాల్లో పూజిస్తారు. గౌరవిస్తారు. 
 

ravan 01

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయ దశమిని జరుపుకుంటారు.  అందుకే ఈ రోజు రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. మనలో చాలా మంది రావణుడు అంటే చెడ్డవాడిగా భావిస్తాం. రావణుడు అంటే చెడు, అశుభంగా భావిస్తుంటారు. కానీ చాలా ప్రదేశాల్లో రావణాసురుడిని దేవుడిలా భావించి పూజలు చేస్తారు. అతని మరణానికి సంతాపం తెలుపుతారు. ప్రతి ఒక్కరిలో మంచి, చెడులు రెండూ ఉంటాయి. రావణుడిలో చెడే కాదు.. మంచి కూడా ఉండి. కానీ చాలా మంది రావణాసురుడిలోని చెడును మాత్రమే చూస్తారు. అందుకే దసరా సందర్భంగా రావణాసుడిలోని మంచి సుగుణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


శివ భక్తుడు

నమలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే..రావణుడు గొప్ప శివభక్తుడు. పురాణాల ప్రకారం.. లంకను తనతో పాటే తీసుకెళ్లడానికి శివుని నివాసమైన కైలాస పర్వతాన్నే రావణుడు ఎత్తాడట. కానీ పరమేశ్వరుడు బొటనవేలుతో పర్వతాన్ని నొక్కుతాడు. దీంతో రావణుడు ఆ పర్వతాన్ని కిందికి దించుతాడు. దీంతో రావణుడికి భరించలేని వేళ్ల నొప్పి కలిగి ఎంతో ఏడుస్తాడు. అయితే శివుని శక్తికి ముగ్ధుడైన రావణుడు శివ తాండవ మూలాన్ని సృష్టించాడు. దీనికి పరమేశ్వరుడు ఆనందించి అతన్ని ఆశీర్వదిస్తాడు. 
 


బ్రహ్మ వారసుడు

రావణుడు బ్రహ్మ వారసుడు అని చాలా మంది నమ్ముతారు. రావణుని తండ్రి విశ్రవ మహర్షి. ఈయన బ్రహ్మదేవుని కొడుకైన పల్సత్యుని పుత్రుడిగా భావిస్తారు. ఇలా రావణాసురుడు బ్రహ్మకు మనవడు అయ్యాడు. 
 

వేద జ్ఞానం

రావణాసురిడి తండ్రి ఒక ఋషి. తల్లి రాక్షసుల వంశానికి చెందింది. అయితే రావణుడు ఈ ప్రపంచంలోనే అత్యంత జ్ఞానవంతుడని కొందరు చెప్తారు. ఇతనికి వేదాల్లోనే కాదు సైన్స్, గణితం, రాజకీయాల్లో కూడా మంచి అవగాహణ ఉందని నమ్ముతారు. రావణాసురుడికి ఎన్నో ఇతర గ్రంథాలు తెలుసు. అందుకే ఇతను రాక్షస వంశానికి చెందిన వాడైనా పండితుడుగా పరిగణించబడుతున్నాడు. 

నైపుణ్యం కలిగిన రాజు, రాజకీయ నాయకుడు

ఎన్నో రామాయణాల్లో.. రావణుడు చనిపోవడానికి దగ్గర్లో ఉన్నప్పుడు ఇతని దగ్గరకు శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణుడు వెళ్లి రావణుడికి నమస్కరించారట. అలాగే అతని నుంచి రాజకీయ జ్ఞానాన్ని పొందారని నమ్ముతారు. రావణుడు రాజకీయాల గురించి బాగా తెలిసినవాడని, సమర్థుడైన రాజు అని చెప్తారు. ఇతని రాజ్యం చాలా సుసంపన్నమైంది. లంకలోని నిరుపేదల దగ్గర కూడా బంగారు పాత్రలు ఉండేవట. 
 

గొప్ప సంగీత విద్వాంసుడు

లంకాపతి రావణాసురుడికి సంగీతమంటే చాలా ఇష్టమట. అంతేకాదు ఆయన చాలా నైపుణ్యం కలిగిన సంగీత విద్వాంసుడని నమ్ముతారు. రావణాసురుడు వీణ బాగా వాయిస్తారట. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శివ తాండవ మూలాన్ని కూడా నిర్మించాడని నమ్ముతారు.

Latest Videos

click me!