బుధవారం ఈ పరిహారాలు చేస్తే వినాయకుడి అనుగ్రహం పొందుతారు.. కష్టాలు మాయం

First Published | Jan 3, 2024, 9:48 AM IST

గణేషుడిని పూజించడం వల్ల ఆనందం, అదృష్టం కలుగుతాయనే నమ్మకం ఉంది. అంతేకాదు వినాయకుడిని పూజిస్తే మీరు అన్ని రకాల బాధల నుంచి విముక్తి పొందుతారు. అందుకే ప్రతి బుధవారం నాడు వినాయకుడిని పూజిస్తారు. జ్యోతిష్యుల  ప్రకారం.. ఈ రోజు కొన్ని పరిహారాలు చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి.  
 

దేవతల దేవుడైన మహాదేవుని కుమారుడైన వినాయకుడినే ముందుగా పూజిస్తారు. వినాయకుడిని పూజించడం వల్ల ఆనందం, అదృష్టం కలుగుతాయి. అంతేకాకుండా మనకున్న అన్నిరకాల బాధల నుంచి విముక్తి పొందుతారు. అందుకే ప్రతి బుధవారం నాడు వినాయకుడని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శుభకార్యాలు సాఫీగా సాగడానికి బుధవారం నాడు చాలా మంది వినాయకుడికి ఉపవాసం కూడా ఉంటారు. జ్యోతిషశాస్త్రంలో బుధవారం ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే నియమం కూడా ఉంది. ఈ పరిహారాలు చేయడం వల్ల ఇంట్లో తిండికి, డబ్బుకు ఎప్పుడూ కూడాకొదవ ఉండదు. మీరు కూడా ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే బుధవారం నాడు ఈ పరిహారాలు ఖచ్చితంగా చేయండి.
 

మీరు గణేశుని అనుగ్రహం పొందాలంటే.. బుధవారం నాడు ఉదయం తలస్నానం చేసి ధాన్యం చేయండి. తర్వాత ధ్యానం చేసి వినాయకుడిని పూజించండి. కాగా పూజా సమయంలో బెల్లంతో చేసిన మోదకాలను వినాయకుడికి సమర్పించండి. బెల్లంతో చేసిన మోదకాలను వినాయకుడికి సమర్పించడం వల్ల గజానుడికి త్వరగా సంతోషం కలుగుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. ఆయన అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది. బెల్లంతో చేసిన మోదకాన్ని వినాయకుడికి సమర్పించి కోరిన ఫలాన్ని పొందొచ్చు.


జమ్మిఆకు గణపతికి ఎంతో ప్రీతికరమైంది. అందుకే బుధవారం పూజ సమయంలో వినాయకుడికి జమ్మిఆకులను సమర్పించండి. అలాగే మీ కోరికలను వినాయకుడికి చెప్పుకోండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల భగవంతుడు త్వరగా సంతోషిస్తాడు. ఆయన అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది. 

lord ganesha 001

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే బుధవారం నాడు గంగాజలం ఉన్న నీటితో స్నానం చేయండి. తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించి సూర్యభగవానుడికి నీటిని సమర్పించండి. ఆ తర్వాత కుంకుమపువ్వు పాలతో వినాయకుడికి అభిషేకం చేయండి. కుంకుమ పువ్వు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనది. ఈ పరిహారాన్ని చేయడం వల్ల గణేశుని అనుగ్రహం మీపై ఉంటుంది. 
 

వినాయకుడికి దుర్వ అంటే చాలా ఇష్టం. అందుకే వినాయకుని ప్రత్యేక అనుగ్రహం పొందడానికి బుధవారం 21 దుర్వను దారంలో కట్టి వినాయకుడికి సమర్పించండి. ఈ సమయంలో సంతోషం, శ్రేయస్సు, సంపద వృద్ధి చెందాలని ఆకాంక్షించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో దుఃఖం, సంక్షోభం, డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.

Latest Videos

click me!