గురువారం నాడు ఈ పనులు చేస్తే వ్యాపారంలో మీకు తిరుగుండదు..

First Published | Dec 14, 2023, 9:38 AM IST

సనాతన ధర్మంలో.. గురువారం నాడు విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ రోజు పెళ్లికాని వారు, పెళ్లైన వారు ఉపవాసం కూడా ఉంటారు. ఈ ఉపవాసం ఆనందాన్ని, అదృష్టాన్ని పెంచుతుందని నమ్ముతారు. అయితే ఈ రోజున కొన్ని పరిహారాలు చేస్తే వృత్తి, వ్యాపారంలో లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటంటే? 
 

విష్ణుమూర్తి

జ్యోతిషశాస్త్రంలో.. బృహస్పతిని జ్ఞానం, సంపదకు కారకంగా వర్ణిస్తారు. జాతకంలో బృహస్పతి వల్ల ఒక వృత్తి, వ్యాపారంలో మంచి లాభాలను పొందుతాడని నమ్మకం. బృహస్పతి బలహీనంగా ఉన్నప్పుడు జాతకుడు జీవితంలో డబ్బుకు సంబంధించిన ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే జాతకంలో బృహస్పతి గ్రహాన్ని బలోపేతం చేయాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సనాతన ధర్మంలో విష్ణువును,  బృహస్పతిని గురువారం నాడు పూజిస్తారు. ఈ రోజు వివాహిత, అవివాహిత స్త్రీలు ఉపవాసం కూడా ఉంటారు. మరి ఈ రోజు ఎలాంటి పరిహారాలు చేస్తే మీ వృత్తి, వ్యాపారంలో లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Lord Vishnu

1. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. బృహస్పతి సంపద ఉన్న ఇంట్లో కూర్చోవడం లేదా జాతకంలో బలమైన బుధుడు ఉండటం వల్ల.. ఆ వ్యక్తి వ్యాపారంలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటాడు. మీ వ్యాపారం లాభాల్లో సాగాలనుకుంటే గురువారం నాడు లక్ష్మీ నారాయణుడిని ఆరాధించండి. అలాగే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఏకశిలా కొబ్బరికాయను సమర్పించండి. వ్యాపారంలో వృద్ధి రావాలని దేవుళ్లను వేడుకోండి. 
 


lord vishnu

2. మీరు డబ్బుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే గురువారం నాడు ఉదయాన్నే స్నానం చేసి ధ్యానం చేయండి. ఆ తర్వాత పచ్చి పాలలో కుంకుమ పువ్వును కలిపి విష్ణుమూక్తికి దక్షిణ శంఖంతో అభిషేకం చేయండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు. దీంతో మీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. 
 

విష్ణుమూర్తి

3. మీరు కెరీర్ లో ముందుకు వెళ్లాలనుకుంటే గురువారం నాడు తప్పకుండా విష్ణువుమూర్తిని పూజించండి. అలాగే పూజా సమయంలో గురు కవచాన్ని పఠించండి. ఈ పరిహారాన్ని కనీసం 16 గురువారాలైనా చేయండి. ఇలా చేయడం వల్ల కెరీర్ లో మంచి పురోగతిని చూస్తారు. 

విష్ణుమూర్తి

4. మీ వివాహానికి ఆటంకం ఏర్పడితే.. ప్రతి గురువారం నాడు తలస్నానం చేసి ధ్యానం చేయండి. ఆ తర్వాత నీటిలో పసుపు వేసి అరటి మొక్కకు అర్ఘ్యం సమర్పించండి. ఇలాగే ప్రతి గురువారం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు త్వరలోనే పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

Latest Videos

click me!