రామ ఏకాదశి ఆ రోజే.. ఈ తప్పులు చేశారో.. పూజ చేసినా ఫలితం ఉండదు

First Published | Nov 2, 2023, 11:17 AM IST

రామ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు విష్ణుమూర్తిని నిష్టగా పూజించి.. దేవుడి అనుగ్రహం పొందుతారు. అంతేకాదు ఈ రోజు విష్ణుమూర్తితో పాటుగా లక్ష్మీదేవిని కలిపి పూజిస్తే ఎన్నో సత్ఫలితాలను పొందుతారు. అయితే ఈ ఏకాదశి రోజున కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఒకవేళ చేస్తే పూజ చేసిన ఫలితాలను కూడా పొందరు. 
 

lord vishnu

హిందూ మతంలో ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు విష్ణుమూర్తి పూజకు అంకితం చేయబడింది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో కృష్ణ పక్షం ఏకాదశి నాడు రామ ఏకాదశిని జరుపకుంటాం. ఈ ఏడాది రామ ఏకాదశిని నవంబర్ 9 న అంటే గురువారం నాడు వచ్చింది. అయితే ఈ ఏకాదశి తిథి నాడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. లేదంటే మీరు పూజ చేసిన ఫలితాలను కూడా పొందలేరు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రామ ఏకాదశి ప్రాముఖ్యత 

ప్రతి ఏడాది ఈ రామ ఏకాదశి దీపావళి పండుగకు ముందే వస్తుంది. ఈ  రోజు భక్తులు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందేందుకు నిష్టగా పూజిస్తారు. ఈ రోజు విష్ణుమూర్తితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. దీనివల్ల ఇద్దరి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల భక్తులకు కీర్తి, సంపద, శ్రేయస్సు లభిస్తాయని విశ్వసిస్తారు.  అందుకే ఏకాదశి నాడు సాయంత్రం పూట  శ్రీమహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల భక్తులకు విష్ణులోకంలో స్థానం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మరి ఏకాదశి తిథి నాడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..


అన్నం తినకూడదు

ఏకాదశి తిథి నాడు అన్నం తినడం నిశిద్దం. పురాణాల ప్రకారం ఏకాదశి తిథి నాడు అన్నం తింటే వచ్చే జన్మలో మీరు సరీసృపాలకు పుడతారు. 
 

తులసికి నీటిని సమర్పించకూడదు

ఏకాదశి తిథి నాడు తులసికి ఎట్టి పరిస్థితిలో నీటిని సమర్పించకూడదు. ఎందుకంటే ఈ రోజు తులసి మాత విష్ణుమూర్తి కోసం ఉపవాసం ఉంటుందని నమ్ముతారు. అందుకే ఏకాదశి రోజున తులసికి  మరచిపోయి కూడా నీళ్లను సమర్పించకూడదు. 
 


చెడు ఆలోచనలకు దూరం

మీరు ఏ దేవుడికి ఉపవాసం ఉన్నా సరే మీ శరీరం, మనస్సు పరిశుభ్రంగా ఉండాలి. అందుకే ఏకాదశి రోజున మీ మనస్సు పరిశుభ్రత కోసం మనస్సులో చెడు ఆలోచనలు రాకుండా చూసుకోండి.  ఈ రోజు అబద్ధాలు చెప్పడం, తిట్టడం, అవమానించడం, చెడు చేయాలనుకోవడం మంచివి కావు. ఒకవేళ ఇలా చేశారంటే ఉపవాసం ఫలితాన్ని అస్సలు పొందరు. 

Latest Videos

click me!