గొడవపడే పనిమనిషి..
చాణక్య నీతి ప్రకారం, ఇంటి పనిమనిషి ఎల్లప్పుడూ గొడవపడి, యజమానితో వాదించి, ఆదేశాలను పాటించకపోతే, ఆ ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తాడు. అలాంటి సేవకుడు కుటుంబ ఖ్యాతిని , క్రమాన్ని ప్రభావితం చేస్తాడు. ఇది జీవితాన్ని దుర్భరం చేస్తుంది.
కష్టంలో సహాయం చేయని బంధువు
కష్ట సమయాల్లో బంధువుల నిజమైన స్వభావం బయటపడుతుంది. చాణక్యుడి ప్రకారం, బంధువులు కష్ట సమయాల్లో మీకు మద్దతు ఇవ్వకపోతే, కేవలం అందరి ముందు గొప్పల కోసం మాత్రమే మాట్లాడితే.. అలాంటి బంధువులు ఉన్నా ఒకటే లేకపోయిన ఒకటే. అలాంటి బంధువులు జీవితాన్ని దుఃఖం , అవమానంతో నింపుతారు.