ఎవరైనా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు సమయం, కాలం, రోజు, నక్షత్రం, వారం చూసుకుని చేయడం ఆచారం. ఎందుకంటే అప్పుడే అన్నీ మంచిగా జరుగుతాయని నమ్మకం. పెళ్లి, గృహప్రవేశం, నిశ్చితార్థం, అన్నప్రాశన, బారసాల, వ్యాపారం ప్రారంభం, ఉద్యోగంలో చేరిక ఇలాంటి వాటికి మంచి సమయం చూసుకోని పనులు ప్రారంభిస్తారు.
ఏ చిన్న పని చేయాలన్నాముహూర్తం చూసుకుంటారు. ఎందుకంటే ఆ పని వల్ల డబ్బులు వస్తాయి. అయితే డబ్బుకు అధిపతి అయిన లక్ష్మీదేవి డబ్బు రూపంలో మీ ఇంటికి రావాలన్నా, ఎక్కువ సంపాదన ఇవ్వాలన్నా కూడా మంచి ముహూర్తం చేసుకోవడం ముఖ్యమంటున్నారు జ్యోతిష్య నిపుణులు. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసే రోజు, తిధి కూడా మీ సేవింగ్స్ పై ప్రభావం చూపుతాయని అంటున్నారు.