దేవుడికి పూజ చేసే సమయంలో హారతి అనేది చాలా ముఖ్యం. దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత.. మనం కూడా ఆ హారతిని కళ్లకు అద్దుకుంటాం. మరి, ఆ హారతి వెలిగించడానికి మనం కర్పూరం వాడతం. ఇంట్లో మాత్రమే కాదు.. దేవయాల్లో అయినా.. హారతిని కర్పూరంతోనే ఇస్తారు. ఆ కర్పూరం వెలిగించినప్పుుడు మంచి సువాసన వెదజల్లుతుంది. మనకు అదో రకమైన తృప్తి కూడా లభిస్తుంది. గుడిలో వెలిగించినా, ఇంట్లో వెలిగించినా.. ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది.