పెళ్లి ముహూర్తాలు ఉన్న తేదీలు
మార్చి 30న ఉగాది కావున అప్పటి నుంచి కొత్త సంవత్సరమైన విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. విశ్వావసు నామ సంవత్సరం చైత్ర మాసం, బహూళ పక్షం పాడ్యమి తిధి నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి.
ఏప్రిల్ 14(పాడ్యమి), ఏప్రిల్ 16(తదియ), ఏప్రిల్ 18(పంచమి), ఏప్రిల్ 19(షష్టి), ఏప్రిల్ 20(సప్తమి, అష్టమి), ఏప్రిల్ 21(అష్టమి, నవమి), ఏప్రిల్ 25(ద్వాదశి), ఏప్రిల్ 29(శుక్ల విదియ), ఏప్రిల్ 30(శుక్ల తదియ). ఈ తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. మీ జాతకరీత్యా ఈ తిథుల్లో ఏ నక్షత్రానికి మంచి ముహూర్తం సెట్ అవుతుందో మీకు దగ్గర్లో ఉన్న ఆలయంలో పండితులను అడిగి ముహూర్తం పెట్టించుకోండి.
గమనిక: ఈ ముహూర్తాలు ప్రాంతాలు, రాష్ట్రాలను బట్టి కాస్త అటు, ఇటుగా మారతాయి. గమనించి పండితులను అడిగి శుభ ముహూర్తం నిశ్చయించుకోండి.