సాధారణంగా చాలావరకు అన్ని ఇళ్లల్లో పూజగది తప్పనిసరిగా ఉంటుంది. చాలామంది ఉదయం పూజ చేసిన తర్వాతే రోజూ వారి పనులు ప్రారంభిస్తుంటారు. అంతేకాదు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కూడా పూజ గదిలోకి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుంటారు. ఎంతో ప్రత్యేకమైన ఈ గదిలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇంట్లో చాలా సమస్యలు వస్తాయట.
వాస్తు ప్రకారం
వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో చేసే కొన్ని పొరపాట్లు ఇంట్లో ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యేలా చేస్తాయి. మీరు కూడా ఇలాంటి తప్పులు చేస్తే వెంటనే సరిదిద్దుకోవడం మంచిది. లేదంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి.
పూజ గది దిశ:
వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది సరైన దిశలో ఉండాలి. ఒకవేళ తప్పు దిశలో ఉంటే మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో పూజ గదిని ఏర్పాటు చేయడానికి ఉత్తర దిశ సరైంది. దక్షిణ, పశ్చిమ దిశలు అంత మంచివి కావు.
విరిగిన విగ్రహాలు
వాస్తు శాస్త్రం ప్రకారం, పూజ గదిలో ఉండే దేవుళ్ల విగ్రహాలను బాగా చూసుకోవాలి. ముఖ్యంగా విగ్రహాలను కడిగేటప్పుడు అవి విరిగిపోకుండా చూసుకోండి. విరిగిన విగ్రహాలను పూజించడం అశుభం అని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనివల్ల దేవుళ్లు కోపగిస్తారట. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందట. పేదరికం వస్తుందట.
పూజ గది ఎక్కడ ఉండకూడదు?
వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిని కట్టేటప్పుడు సరైన స్థలంలో కట్టాలి. బెడ్ రూమ్, మెట్ల కింద, బాత్రూమ్ దగ్గర అస్సలు కట్టకూడదు. దానివల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అంతేకాదు ఇంట్లో పూజ గది ఎప్పుడూ తెరిచే ఉండాలి. ఇది ఇంట్లోకి మంచి శక్తిని ప్రసారం చేస్తుంది.