లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే... రాత్రిపూట చేయకూడని పనులు ఇవే

First Published | Aug 27, 2024, 3:54 PM IST

హిందూ పురాణాల ప్రకారం, లక్ష్మీదేవి అనుగ్రహం పొంది, సంపద పెంచుకోవాలంటే.. రాత్రిపూట పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదట. మరి.. అవేంటో ఓసారి చూద్దాం..


వాస్తు శాస్త్రం ప్రకారం ఏ పని చేయడానికైనా కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని పాటిస్తే లాభం కలిగినట్లే.. పాటించకపోతే నష్టం  కలుగుతుంది. ఈ క్రమంలో.. రాత్రిపూట పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. అవేంటో ఓసారి  చూద్దాం..

వాస్తు ప్రకారం రాత్రిళ్లు గోళ్లు కత్తిరించకూడదు. అలా చేస్తే ఇంట్లో దరిద్రం వస్తుంది. అంతేకాదు లక్ష్మీదేవి కోపానికి గురవుతారు.


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాత్రిళ్లు స్త్రీలు జుట్టు విరబోసుకుని పడుకుంటే అది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని అర్థం. దీనివల్ల ఇంట్లో సిరిసంపదలకు భంగం కలిగించడమే కాకుండా, భర్త ఆయుష్షు కూడా తగ్గుతుంది.

అలాగే రాత్రిళ్లు వంటగదిలో పాత్రలు కడిగకుండా ఉంచకూడదు. అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఇంట్లో దరిద్రం రావడం మొదలవుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది, ఇంట్లో శాంతి భగ్నం అవుతుంది.

కొన్ని ఇళ్లలో సూర్యాస్తమయం తర్వాత లేదా రాత్రిళ్లు ఇల్లు తుడుస్తారు. అలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉండదు. లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుందని చెబుతారు. అందుకే, మీరు దక్షిణ దిక్కుగా చీపురు పెట్టి పడుకుంటే లక్ష్మీదేవి కృప లభిస్తుంది.

హిందూ  శాస్త్రంలో  దానం చేయడం చాలా పుణ్యప్రదమైనదిగా భావిస్తారు. కానీ రాత్రిళ్లు పాలు, పంచదార లేదా ఉప్పు దానం చేయడం అశుభం అని భావిస్తారు. అలా చేయడం వల్ల ఆ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.

Latest Videos

click me!