గణపతికి ఇష్టమైన కుడుములు వివిధ రంగుల్లో.. ఇలా తయారు చేయండి

First Published | Aug 31, 2024, 1:42 PM IST

సెప్టెంబర్ 7న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మరి ఆ రోజున భక్తులు గణపతిని ప్రతిష్టించి ఆయనకు వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అసలు వినాయకుడికి చాలా ఇష్టమైన ఏంటో తెలుసా.. అవే ఉండ్రాళ్లు, కుడుములు(మోదకాలు). అందుకే వినాయకుడిని మోదక ప్రియుడు అంటారు. గణనాథునికి ప్రీతికరమైన కుడుములలోనూ చాలా రకాలు ఉన్నాయి. అవేంటో, వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

కోకోనట్ రోజ్ కుడుములు

పింక్ రంగులో ఉండే ఈ కుడుములు చూస్తే ఎవరికైనా తినాలనిపిస్తుంది. మీరు వినాయక చతుర్థి నాడు గణనాథుడికి నైవేద్యంగా పెట్టడానికి కుడుములు తయారు చేస్తారు కదా..  వాటిని తయారు చేయడానికి ఉపయోగించే తెల్లని పిండిలో రోజ్ సిరప్ కలిపి తయారు చేస్తే కుడుములు గులాబీ రంగులో ఉంటాయి. అందులో కొంచెం బీట్‌రూట్ రసం కూడా కలిపితే మరింత లేత పింక్ రంగులో ఉంటాయి.

మఖానా కుడుములు

మీరు కుడుములలో డ్రై ఫ్రూట్స్ రుచిని కోరుకుంటే మఖానా కుడుములు తయారు చేయండి. వీటి తయారీ ఎలా అంటే.. ముందుగా మఖానాను తేలికగా వేయించండి. తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ బాదం ముక్కలు, పిస్తా వంటివి విడిగా వేయించుకోండి. తర్వాత మఖానాను మిక్సీలో పొడి చేసుకోండి. ఇప్పుడు పాన్‌లో పాలు వేడి చేసి, మఖానా పొడిని కలిపి చిక్కబడే వరకు ఉడికించాలి. దానితో పాటు డ్రై ఫ్రూట్స్, పంచదార కలిపి పేస్ట్ లా చేసుకోండి. అచ్చు సహాయంతో కుడుములు తయారు చేసుకోండి.


బెల్లం కొబ్బరి కుడుములు

బెల్లం, కొబ్బరితో చేసిన కుడుములను బియ్యం పిండితో తయారు చేస్తారు. స్టఫింగ్ కోసం బెల్లంతో పాటు తురిమిన కొబ్బరి, ఏలకులు కూడా కలుపుకోవచ్చు. కుడుములను స్టీమర్‌లో ఉడికించేటప్పుడు అరటి ఆకుతో కప్పండి. ఇలా చేయడం వల్ల కుడుముల రుచి అద్భుతంగా ఉంటుంది.

చాక్లెట్ కుడుములు

మీరువినాయకుడితో పాటు ఇంట్లో పిల్లలను కూడా సంతోషపెట్టాలనుకుంటే చాక్లెట్ కుడుములు తయారు చేయాలి మరి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వీటి తయారీ కోసం మీరు తెల్లని బియ్యం పిండిలో చాక్లెట్ పౌడర్ కలపాలి. ఇలాంటి కుడుములు తినడానికి రుచికరంగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

Latest Videos

click me!