రాజమౌళి, సుకుమార్, నాగ్ అశ్విన్.. త్వరలో కొరటాల.. త్రివిక్రమ్ నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలంటే ఇవి వదిలేయాలి ?

First Published | Jun 27, 2024, 8:45 PM IST

రాజమౌళి ఇచ్చిన ప్రోత్సాహంతో టాలీవుడ్ డైరెక్టర్లు ఒకర్ని మించేలా మరొకరు భారీ పాన్ ఇండియా చిత్రాల వైపు అడుగులు వేస్తున్నారు. చందు ముండేటి లాంటి యువ దర్శకుడు కూడా కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేశాడు. 

రాజమౌళి ఇచ్చిన ప్రోత్సాహంతో టాలీవుడ్ డైరెక్టర్లు ఒకర్ని మించేలా మరొకరు భారీ పాన్ ఇండియా చిత్రాల వైపు అడుగులు వేస్తున్నారు. చందు ముండేటి లాంటి యువ దర్శకుడు కూడా కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేశాడు. ఇదంతా రాజమౌళి.. ఇతర డైరెక్టర్లకు పరోక్షంగా ఇచ్చిన ధైర్యమే. 

బాలీవుడ్ వాళ్ళు మన సినిమాని చూస్తారా అనే అనుమానాలు ఉన్న సాయంలో అత్యంత భారీ బడ్జెట్ లో బాహుబలి చిత్రాన్ని రాజమౌళి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చేసి చూపించారు. బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్వరూపమే మారిపోయింది. 


ఆ తర్వాత సుకుమార్ పుష్ప చిత్రానికి నార్త్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. సుకుమార్ టేకింగ్ నార్త్ లో బాగా వర్కౌట్ అయింది. అదే జోష్ లో సుక్కు ఇప్పుడు పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం భారీ బడ్జెట్ లో రూపొందుతోంది. 

nag ashwin

టాలీవుడ్ లో మరో అగ్ర దర్శకుడు కొరటాల శివ కూడా పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల దేవర అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 400 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆల్రెడీ ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం హిట్ అయితే కొరటాల కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతారు. 

Trivikram Srinivas

మహానటి చిత్రంతో అనూహ్యంగా తన ట్యాలెంట్ మొత్తం బయట పెట్టిన డైరెక్టర్ నాగ్ అశ్విన్.. తాజాగా ఏకంగా కుంభస్థలాన్నే బద్దలు కొట్టాడు. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ కి ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కింది. పాన్ ఇండియా హీరో చేతిలో ఉండడంతో నాగ్ అశ్విన్ సాహసం చేసేందుకు వెనుకాడలేదు. తన క్రియేటివిటీకి పదును పెట్టి మహాభారతాన్ని కలియుగాన్ని లింక్ చేస్తూ సైన్స్ ఫిక్షన్ కథ రాసుకున్నారు. నేడు విడుదలైన కల్కి 2898 AD చిత్రం సూపర్ పాజిటివ్ రిపోర్ట్స్ సొంతం చేసుకుంది. ఇక నాగ్ అశ్విన్ పేరు పాన్ ఇండియా వైడ్ గా మారు మోగడం ఖాయం. 

ఇదిలా ఉండగా టాలీవుడ్ లో ఒక్క అగ్ర డైరెక్టర్ మాత్రం ఇంకా పాన్ ఇండియా సినిమా ప్రయత్నం చేయలేదు. ఆయనే త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ చిత్రాల్లో మాటల పదును, ఎమోషన్స్ కి ఉండే బలం అందరికి తెలుసు. కానీ పాన్ ఇండియా స్థాయిలో రాణించాలంటే ఫ్యామిలీ ఎమోషన్స్, డైలాగ్స్ సరిపోవు. త్రివిక్రమ్ క్రియేటివిటీ కేవలం ఫ్యామిలీ ఎమోషన్స్ కి మాత్రమే పరిమితం అనే విమర్శ ఉంది. 

త్రివిక్రమ్ పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదగాలంటే కుటుంబ కథా చిత్రాల సర్కిల్ లోనుంచి ఆయన బయటకి రావాలి అని ఆడియన్స్ అంటున్నారు. త్రివిక్రమ్ తదుపరి చిత్రం అల్లు అర్జున్ తో ఉండబోతోంది. అల్లు అర్జున్ తో సినిమా అంటే తప్పనిసరిగా పాన్ ఇండియా మూవీనే చేయాలి. సో త్రివిక్రమ్ రొటీన్ ఫ్యామిలీ స్టోరీస్, డైలాగులపై ఫోకస్ తగ్గించి.. పురాణాలు, సైన్స్ ఫిక్షన్, జానపదాలు లాంటి కథలపై దృష్టి పెట్టాలి అని అంటున్నారు. 

Latest Videos

click me!