నాగార్జున కెరీర్‌లో మైలు రాయి లాంటి చిత్రం `శివ`. ఆయనకు మాస్ ఇమేజ్‌ని తీసుకొచ్చిన మూవీ. కెరీర్ పరంగా బిగ్ బ్రేక్‌ని తెచ్చిన చిత్రం కూడా. అప్పట్లో ఇదొక ట్రెండ్ సెట్టర్. ఈ మూవీతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిచయం అయ్యారు. ఆయన టేకింగ్ తెలుగు సినిమాని కొత్త పుంతలు తొక్కించింది. చాలా మంది మేకర్స్ ఈ మూవీ మేకింగ్‌ని ఓ లెసన్‌గా భావించారు. రెగ్యూలర్ సినిమా ఫార్ములాని బ్రేక్ చేసిన చిత్రమిది. ఇప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో ఈమూవీకి ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
Shiva Movie
రామ్ గోపాల్ వర్మ టాలెంట్‌ని, కాన్ఫిడెన్స్ ని చూసిన నాగార్జున `శివ`కి దర్శకుడిగా ఆఫర్ ఇచ్చాడు. డైరెక్టర్‌గా పరిచయం చేశారు. ఈ మూవీతోనే మరో నటుడు జేడీ చక్రవర్తి కూడా తెలుగు తెరకి పరిచయం అయ్యాడు. ఈ సినిమాకి తను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా. అయితే నాగార్జునని జేడీ అంతకు ముందు డైరెక్ట్ గా చూడలేదు. ఆ మూవీ సెట్‌లోనే మొదటిసారి కలిశాడు. అందులో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. జేడీ చక్రవర్తిని నాగార్జున కొట్టడం అప్పట్లో సంచలనంగా మారింది.
`శివ` సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ఓ కేఫ్‌లో చిత్రీకరణ జరుగుతుందట. నాగార్జున కేఫ్ లో నుంచి బయటకు వస్తున్నారట. ఆయన్ని జేడీ చక్రవర్తి చూసుకోలేదట. తాను హడావుడిగా లోపలికి వెళ్తున్నాడట. ఈ క్రమంలో అట్నుంచి వస్తోన్న నాగార్జునని చూసుకోకుండా గుద్దేశాడట జేడీ చక్రవర్తి. దీంతో నాగ్‌కి మండింది. ఏ చూసుకోవా అని గట్టిగా అన్నాడట. నేను చూసుకోలేదు, మీరు కూడా చూసుకోలేదని కాస్త రాష్‌గా సమాధానం చెప్పాడట జేడీ.
ఏం అనుకుంటున్నావ్ నువ్వు అని నాగ్ అనగా, అనుకోవడానికి ఏముందండి అన్నాడట జేడీ, దీంతో మండిపోయిన నాగ్ పిచ్చి పిచ్చి వేశాలేస్తున్నావా? అన్నాడట. దీంతో దెబ్బకి సెట్‌లో అందరూ దూరం జరిగారు. అందరి వీరిద్దరినే చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావ్ అని జేడీని ప్రశ్నించాడు నాగ్, సర్ బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటూ జేడీ కామెంట్ చేశాడు. దీంతో కోపం వచ్చిన నాగార్జున లాగి పెట్టి గట్టిగా కొట్టాడట. దీంతో ఆవేశానికి గురైన జేడీ.. నాగార్జునని పట్టుకోబోయాడట.
దీంతో అందరి ముందు సెట్‌లోనే ఇరగ్గొట్టాడట నాగార్జున. అందరు షాక్. ఎవరూ దగ్గరికి రావడం లేదు. కొడుతూనే ఉన్నాడట నాగార్జున. దీంతో అన్నపూర్ణ స్టూడియో వాళ్లు రాడ్లు తీసుకుని జేడీ మీదకు వచ్చారట. కట్ చేస్తే నాగార్జున.. జేడీని తీసుకుని కేఫ్ లోపలికి పరిగెత్తాడట. కాసేపు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అంతా అయోమయం. ఒక హీరోపైకి కొత్తగా వచ్చిన కుర్రాడు ఎదురు తిరగడం షాకిచ్చిందట. మరి ఇంతకి ఏం జరిగిందంటే ఇదంతా ముందస్తు ప్లాన్ చేసిన స్కిట్ అట.
సినిమాలో ఓ సీన్ కోసం రహస్యంగా నాగార్జున, జేడీ ప్లాన్ చేశారట. ఎవరికీ తెలియకుండా ఇది చేసినట్టు చెప్పాడు జేడీ. రామ్ గోపాల్ వర్మ కి డౌట్‌గా ఉన్నా, లేదు సర్ తాను చేస్తానని నమ్మకాన్ని ఇచ్చి చేశారట. ఈ విషయం తెలిసే, పైన రహస్యంగా ఓ కెమెరాని, సైడ్‌లో మరో కెమెరాని పెట్టి ఈ సన్నివేశాన్ని సీక్రెట్‌గా షూట్ చేశాడట వర్మ. ఇలా అత్యంత సహజంగా ఈ సీన్ తీశామని, అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు జే. సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. నాగార్జున వండర్‌ఫుల్ హ్యామన్ బీయింగ్ అని చెప్పారు.
జేడీ చక్రవర్తి విలన్‌గా ప్రారంభమై, హీరోగా మారాడు. అనేక సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు. ఇతర హీరోల సినిమాల్లోనూ నటించి అలరించారు. చాలా కాలంగా సినిమాలకు దూరమయ్యాడు. చాలా అరుదుగా కనిపిస్తున్నాడు. ఆ మధ్య `దయా`అనేవెబ్ సిరీస్‌లో నటించి ఆకట్టుకున్నాడు. దీనికి మంచి స్పందన లభించింది. ఇప్పుడు మళ్లీ నటుడిగా స్పీడ్ పెంచినట్టు తెలుస్తుంది. జేడీ.. వర్మ శిష్యుడనే విషయం తెలిసిందే.