72గంటలు కేవలం పండ్లు మాత్రమే తింటే ఏమౌతుంది..?

First Published | Jul 22, 2024, 3:45 PM IST

ఇన్ని ప్రయోజనాలు ఉన్న  ఈ పండ్లను వరసగా 72 గంటలు తీసుకుంటే ఏమౌతుంది. అంటే.. . మరే ఇతర  ఆహారాలు తీసుకోకుండా, కేవలం పండ్లు మాత్రమే తీసుకుంటే ఏమౌతుంది.? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...
 

పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.  ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా మన డైట్ లో పండ్లు భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతూ ఉంటారు. అంతెందుకు.. పండ్లు మన బాడీని డీటాక్స్ చేయడంలో సహాయపడతాయి.  బరువు తగ్గడంలోనూ, మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పండ్లలో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న  ఈ పండ్లను వరసగా 72 గంటలు తీసుకుంటే ఏమౌతుంది. అంటే.. . మరే ఇతర  ఆహారాలు తీసుకోకుండా, కేవలం పండ్లు మాత్రమే తీసుకుంటే ఏమౌతుంది.? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...

పండ్లు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.  వీటిలో అంతర్గత అవయవాలను నియంత్రించడం, చర్మాన్ని పునరుద్ధరించడం , తేజస్సుగా ఉంచడం,  ఆరోగ్యకరమైన బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి. మూడు రోజుల పాటు కేవలం పండ్లను ఆహారంగా తీసుకోవడాన్ని   ఫ్రూటేరియన్ డైట్ అని పిలుస్తారు. ఇది ప్రోటీన్, విటమిన్లు, ఖనిజ లవణాలు యాంటీఆక్సిడెంట్లతో మీ శరీరాన్ని నింపడానికి సహాయపడుతుంది.

Latest Videos


అసలు, ఈ డైట్ ఎలా చేస్తారు..? ఈ డైట్ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి..? నష్టాలేంటో చూద్దాం...


మొదటిరోజు..
12 గంటలు పండ్లు తినడం తర్వాత, మీరు మంచి , మెరుగైన జీర్ణక్రియను అనుభవిస్తారు. శరీరం పండ్లలో ఉన్న పోషకాలను జీర్ణం చేసుకోవడం  ప్రారంభిస్తుంది,  బ్లోటింగ్ సమస్యలు, ఏదైనా జీర్ణ సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి.

రెండోరోజు 

రెండవ రోజు పండు ఆహారం మునుపటి నిల్వల్లోని కొవ్వును శక్తి మూలంగా ఉపయోగించడానికి శరీరం nutritional ketosis లోకి ప్రవేశిస్తుంది. అయితే, పండ్లలో ఉన్న కార్బోహైడ్రేట్లు ketosis ను పూర్తి చేయడంలో విఫలమవుతాయి. ఇది స్థిరమైన ప్రాసెస్ కాదు,పోషక లోపాలను కలిగిస్తుంది. 

మూడోరోజు 
మూడవ రోజు, పండ్లు తినడం వల్ల మీరు అధిక శక్తి, మంచి ఇమ్యూనిటీ , శరీరాన్ని డిటాక్స్ చేసే ప్రాసెస్ అవుతుంది. దీనివల్ల మీకు ఎక్కువ శక్తి, క్లియర్ చర్మం, యాంటీ ఏజింగ్ ప్రభావం కలుగుతుంది.

డిటాక్స్ డైట్ కోసం ఉత్తమ పండ్లు:
ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు: అన్ని రకాల బెర్రీలు, ఆపిల్స్, ఆరంజెస్, కివీస్,  దానిమ్మ.
 

fruits


ఇలా పండ్లు మాత్రమే తినడం వల్ల కలిగే నష్టాలు.. 
- బరువు పెరుగుదల.. పండ్లలో అధికంగా ఉండే నేచురల్ షుగర్స్ వల్ల ఎక్కువ పండ్లు తినడం వల్ల బరువు పెరుగుతారు.
-దంతాలు పాడవ్వడం.. అధిక పండ్ల షుగర్ వల్ల దంతాలు నాశనం అవుతాయి. పండ్ల ఆమ్లాలు దంతాలపై ఉండే పొరను కోల్పోయేలా చేస్తుంది.
- క్రేవింగ్స్ పెరుగుదల:  కేవలం పండ్లు మాత్రమే తినాలి అనే రూల్ కారణంగా.. ఇరత ఫుడ్స్ పై క్రేవింగ్స్ బాగా పెరుగుతాయి.
డయాబెటిస్.. ఉన్నత రక్తంలో చక్కెర స్థాయిలు ఉన్నవారికి పండ్ల డైట్ ప్రమాదకరం.


డిస్క్లైమర్:

ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న సలహాలు , సూచనలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆహారం మార్పులు చేసే ముందు మీ డాక్టర్ లేదా డైటిషియన్‌ను సంప్రదించండి.
 

click me!