అనసూయ, గీతా మాధురి ముందే రోజాపై సుధీర్ సంచలనం.. డైరెక్ట్ గా అంత మాట అనేశాడు ఏంటి

First Published | Jun 28, 2024, 2:30 PM IST

ఊహించని విధంగా సుధీర్.. అక్కడ అనసూయ, గీతా మాధురి ఉండగానే ఏపీ పాలిటిక్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2024 ఎలక్షన్స్ కి సంబంధించిన ప్రశ్న.. దీనికి మీరు చాలా సులభంగా సమాధానం చెప్పొచ్చు అంటూ సుధీర్ తెలిపాడు. 

జబర్దస్త్ యాంకరింగ్ మానేసిన తర్వాత అనసూయ బుల్లితెర నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకుంది. సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో అనసూయ బుల్లితెరపై గ్యాప్ ఇచ్చింది. అయితే ఇటీవల సినిమా అవకాశాలు తగ్గాయి లేక ఇతర కారణలో తెలియదు కానీ సడెన్ గా అనసూయ బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చింది. 

ఆమె రీ ఎంట్రీ ఇవ్వడమే వివాదంతో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే షోలో అనసూయ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షోలో అనసూయ శేఖర్ మాస్టర్ తో కలసి తాను ధరించిన జాకెట్ ధరించి ఎక్స్ ఫోజింగ్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఇది పక్కన పడితే సుడిగాలి సుధీర్ హోస్ట్ గా చేస్తున్న సర్కార్ 4 షోలో కూడా అనసూయ పాల్గొంది. 


ఇటీవల విడుదలైన ఈ షో ప్రోమో వైరల్ గా మారింది. అనసూయతో పాటు సింగర్ గీతా మాధురి, సింగర్ మనో, డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ పాల్గొన్నారు. ఒక్కొక్కరు సుధీర్ పై సెటైర్లు ఎంట్రీ ఇచ్చారు. ఏంటండీ ఇంత రెడీగా తయారై వచ్చారు అని సుధేర్ అడుగుతాడు.. యాంకర్ నువ్వని తెలియక అంటూ అనసూయ ఫన్నీగా సెటైర్ వేసింది. 

బాబా భాస్కర్ ఎంట్రీ ఇవ్వగానే.. మాస్టర్ ఎందుకని డ్యాన్స్ మాస్టర్లు స్టెప్పులు వేయిస్తూ 12345678 అని 8 దగ్గర ఆపేస్తారు అని అడిగాడు. దీనికి బాబా భాస్కర్ సమాధానం ఇస్తూ మనిషన్నాకా ఏదో ఒక నంబర్ దగ్గర ఆపాలిరా.. నీలాగా ఆపకుండా చేస్తూనే ఉండకూడదు అని కామెడీ పంచ్ వేశారు. 

RK Roja

ఆ తర్వాత వీళ్ళందరికీ సుధీర్ గేమ్ నిర్వహించాడు. సమాధానాలు చెప్పి మనీ గెలుచుకునే గేమ్. అయితే ఊహించని విధంగా సుధీర్.. అక్కడ అనసూయ, గీతా మాధురి ఉండగానే ఏపీ పాలిటిక్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2024 ఎలక్షన్స్ కి సంబంధించిన ప్రశ్న.. దీనికి మీరు చాలా సులభంగా సమాధానం చెప్పొచ్చు అంటూ సుధీర్ తెలిపాడు. 

Anasuya Bharadwaj

పవన్ కళ్యాణ్ ని సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అంటూ రోజా చేసిన కామెంట్స్ ఎంతలా వైరల్ అయ్యాయో తెలిసిందే. పవన్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రోజా దారుణంగా ట్రోలింగ్ కి గురయ్యారు. ఇప్పుడు అదే విషయాన్ని సుధీర్ డైరెక్ట్ గా చెప్పాడు. దీనితో అనసూయ, గీత మాధురి వింతగా రియాక్షన్ ఇచ్చారు. 

Latest Videos

click me!