నెంబరు సెట్ చేయండి
మీరు ఏ రకమైన గడ్డం కావాలనుకుంటున్నారో దాని ప్రకారం.. ఎక్కువ లేదా తక్కువ నంబర్ ను ముందే సెట్ చేయండి. నంబర్ ను బట్టి గడ్డాన్ని కుదించుకోవాలి. దీంతో మొత్తం గడ్డాన్ని సెట్ చేసుకోవడం ఈజీ అవుతుంది.
చిక్ లైన్ సెట్ చేయండి
గడ్డాన్ని కట్ చేసే ముందు మొదటగా చిక్ టైన్ ను అంటే బుగ్గల దగ్గర సెట్ చేయండి. ఇది మీ ముఖాన్ని బట్టి ఉండాలే చూసుకోవాలి. మీకు ఒత్తైన గడ్డం గనుక ఉన్నట్టైతే చిన్నగా కట్ చేసుకోండి. దీనివల్ల మీ బుగ్గలు చదునుగా కనిపిస్తాయి. చిక్లైన్ సెట్ చేయడానికి దువ్వెనను వాడండి. కొంచెం దూరంలో క్లీన్ షేవ్ చేసుకోవాలంటే రేజర్ ను వాడండి.