ఎవరు లెమన్ వాటర్ తాగకూడదో తెలుసా?

First Published | Aug 16, 2024, 1:01 PM IST

చాలా మంది ఉదయాన్నే లెమన్ వాటర్ ను తాగుతుంటారు. ఈ లెమన్ వాటర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మీరు హెల్తీగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ ఈ లెమన్ వాటర్ ను కొంతమంది అస్సలు తాగకూడదు. ఎందుకంటే?
 

lemon water


నిమ్మకాయ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా చాలా మంది బరువు తగ్గడానికి రోజూ ఉదయాన్నే లెమన్ వాటర్ ను తాగుతుంటారు. ఈ లెమన్ వాటర్ జీర్ణక్రియను మెరుగుపర్చడానికి, బరువు తగ్గడానికి డిటాక్స్ గా ఉపయోగపడుతుంది. నిమ్మకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే చాలా మంది నిమ్మకాయ నీళ్లను తాగుతుంటారు. కానీ కొంతమంది మాత్రం ఈ లెమన్ వాటర్ ను పొరపాటున కూడా తాగకూడదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

lemon water

యాసిడ్ రిఫ్లక్స్, అల్సర్ ఉన్నవారు..

లెమన్ ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. అయితే గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్, పెప్టిక్ అల్సర్ వంటి సమస్యలు ఉన్నవారు నిమ్మరసాన్ని తాగితే సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. నిమ్మరసం అతిగా తాగితే మీకు ఇబ్బందులు తప్పవు. ఈ సమస్యలున్నవారు నిమ్మరసం తాగితే గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఇలాంటి వారు నిమ్మకాయను మొత్తమే తినకూడదు. ఒకవేళ తిన్నా లిమిట్ లోనే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


lemon water

పంటి సమస్య 

దంతాల సమస్య ఉన్నవారు కూడా లెమన్ వాటర్ ను తాగకూడదు. ముఖ్యంగా నిమ్మరసాన్ని నీటిలో పోయకుండా.. లేదా ఎక్కువ మోతాదులో రోజూ తీసుకుంటే దంత సమస్యలు మరింత పెరుగుతాయి. 

నిమ్మకాయకు అలెర్జీ

కొంతమందికి నిమ్మకాయకు కూడా అలెర్జీ ఉంటుంది. ఇలాంటి వారు నిమ్మరసాన్ని తాగితే దురద, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. లేదా నాలుక, పెదవులు, గొంతులో వాపు ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారు కూడా నిమ్మకాయకు దూరంగా ఉండాలి. 
 

Lemon water

మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది

అవును నిమ్మకాయను తీసుకుంటే కొంతమంది వాడే మందుల ప్రభావాన్ని తగ్గిస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. మీకు తెలుసా? నిమ్మకాయ కాలేయ ఎంజైమ్లను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మందులు సరిగా జీవక్రియ చేయబడవు.

lemon water

కిడ్నీ స్టోన్ సమస్య

మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లు, కొన్ని కూరగాయలను తినకూడదు. ఎందుకంటే నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లు, కొన్ని కూరగాయల్లో ఆక్సలేట్ ఉంటుంది. ఇది కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేలా చేస్తుంది. కిడ్నీ స్టోన్స్ కు ట్రీట్మెంట్ తీసుకున్న వారు లేదా కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు ఆక్సలేట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తినకూడదు. 

Latest Videos

click me!