ఇకపై ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నీళ్లు తాగకండి.. ఎందుకంటే?

First Published Aug 16, 2024, 3:00 PM IST

బయటికి వెళ్లినప్పుడే కాకుండా.. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నీళ్లనే తాగుతుంటారు. దాదాపుగా ప్రతిఒక్క ఇంట్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి. కానీ ఈ బాటిల్ నీళ్లను తాగితే ఏమౌతుందో తెలుసా? 

మనలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల నీళ్లే తాగుతుంటారు. ఇంట్లో స్టీల్ గ్లాసులు ఉన్నా.. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నీళ్లనే తాగుతుంటారు. అలాగే జర్నీ, పెళ్లిళ్లు, ఫంక్షన్లలో కూడా వాటర్ బాటిల్ నీళ్లనే తాగుతుంటారు. కానీ ప్లాస్టిక్ బాటిల్ వాటర్ ను అస్సలు తాగకూడదు. ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్ నీళ్లను తాగితే అధిక రక్తపోటు సమస్య వస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. 
 

ఆస్ట్రియాలోని డాన్యూబ్ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన మెడిసిన్ విభాగానికి చెందిన పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ప్రకారం..  ప్లాస్టిక్ బాటిల్ నీళ్లను తాగితే మన రక్తప్రవాహంలోకి  మైక్రోప్లాస్టిక్స్ వెళతాయి. అధ్యయనంలో పాల్గొన్న వారిలో ప్లాస్టిక్ బాటిళ్లు కాకుండా ఇతర పాత్రల్లో నీళ్లను తాగిన వారిలో బీపీ తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.
 

Latest Videos


ఈ మైక్రోప్లాస్టిక్స్ గుండెకు సంబంధించిన సమస్యలు, క్యాన్సర్,  హార్మోన్ల అసమతుల్యతతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని పరిశోధకులు అంటున్నారు. ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి వచ్చే మైక్రోప్లాస్టిక్, అధిక రక్తపోటుకు మధ్య సంబంధాన్ని పరిశోధకులు దీనిలో గుర్తించారు. 
 

మీరు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే అధిక రక్తపోటు తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లలోని పానీయాలను తాగితే మన శరీరంలోకి 5 గ్రాముల వరకు మైక్రోప్లాస్టిక్స్ వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

అయితే ప్లాస్టిక్ బాటిళ్లలోని నీళ్లను బాగా మరిగించి చల్లాల్చి తాగితే ఈ సమస్య తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మైక్రోప్లాస్టిక్స్, నానోప్లాస్టిక్స్ ఉనికిని 90 శాతం తగ్గుతుందట. 
 

click me!