మహిళల్లో పీరియడ్స్( రుతుక్రమం) రావడం అనేది సర్వసాధారణం. అది నెలనెలా వస్తూనే ఉంటుంది.అయితే పీరియడ్స్ విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. నూటికి 90శాతం మంది పీరియడ్స్ సమయంలో సెక్స్ కి దూరంగా ఉంటారు.
కొంత మంది మాత్రం ధైర్యం చేసి.. ఆ సమయంలో కూడా తమ శృంగార జీవితానికి బ్రేకులు పడకుండా చూసుకుంటారు.అయితే.. నిజానికి పరియడ్స్ లో సెక్స్ సురక్షితమేనా..? దీనివల్ల ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా..? అసలు దీనిపై యువతీ యువకుల అభిప్రాయాలు ఎలాఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
పీరియడ్ సమయంలో సెక్స్ పై పరిశోధకులు 500 మంది యువతీ యువకుల అభిప్రాయాలు తీసుకుంటే అందులో 55 శాతం మంది నెలసరి సమయంలో సెక్స్‌తో సౌకర్యవంతంగానే ఉన్నామని చెప్పారు.
ఆ సమయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదని అన్నారు. మరో 45 శాతం మంది ఆ సమయంలో సెక్స్ సరికాదని అనలేదు.అంతెందుకు.. 45శాతం మంది స్త్రీలకు ఆ సమయంలో ఎక్కువ కోరికలు కలుగుతుంటాయని ఓ సర్వేలో తేలింది.
అసలు ఆ సమయంలో శృంగారంలో పాల్గొనే విషయంపై అమ్మాయిలు, అబ్బాయిలు ఏమంటున్నారో ఓ సంస్థ సర్వే చేసింది.
కొందరి మహిళలపై చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.70శాతం మంది మహిళలు నెలసరి సమయంలో సెక్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సర్వేలో వెల్లడయ్యింది.అయితే.. అబ్బాయిలు మాత్రం అంత ఆసక్తి చూపించలేదట.
కొందరైతే.. ఆ సమయంలో కూడా సెక్స్ ని బాగా ఎంజాయ్ చేయగలిగామని చెబుతున్నారు. మరికొందరు తమ నెలసరిలో వచ్చే నొప్పిని మర్చిపోగలుగుతున్నామని చెప్పడం విశేషం.
ఇంకొందరేమో.. తమకు ఆసక్తి ఉన్నా,... తమ భర్తలకు ఆ సమయంలో చేయడం ఇష్టం ఉండటం లేదని చెబుతున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే ఆ సమయంలో శృంగారంలో పాల్గొనడం తమకు ఇష్టం ఉండదని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. నెలసరిలో పరిశుభ్రంగా ఉండాలని చాలా మంది మహిళలు భావిస్తుంటారు. అందుకే ఆ సమయంలో సెక్స్‌ను ఇష్టపడరు. నెలసరి అప్పుడు మహిళల ప్రైవేటు శరీర భాగాల నుంచి స్రావాలు రావడం సాధారణమే.
పీరియడ్ సమయంలో కలవడం వల్ల రక్తస్రావం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నెలసరి సమయంలో భావప్రాప్తి కలిగినప్పుడు గర్భాశయ సంకోచాలు మరింత ధృడమవుతాయి. ఆ సమయంలో కలిసినప్పుడు పీరియడ్స్ వల్లే వచ్చే ఇబ్బందులు కూడా తక్కువగా అనిపిస్తాయి
'సెక్స్‌లో పాల్గొనేప్పుడు ఆక్సిటోసిన్ అనే హర్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీన్నే బాండింగ్ హార్మోన్ అని కూడా అంటారు. ప్రసవ సమయంలో కూడా హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. పురిటి నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో హార్మోన్లు సహాయపడుతాయి'' ఓ శాస్త్రవేత్త తెలిపారు.
పీరియడ్స్ పెయిన్ తగ్గించేందుకు.. మనసు ప్రశాంతంగా ఉండేందుకు ఆ సమయంలో సెక్స్ ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. అయితే.. ఇది చాలా మంది మగవారికి మాత్రం ఇష్టం ఉండదట. ఆ సమయంలో వారికి మాత్రం చిరాకుగా ఉంటుందని వారు చెబుతున్నారు.