పురుషుల్లోనూ మోనోపాజ్ దశ.? శృంగారానికి పనికి రారా?

First Published | Feb 23, 2021, 12:05 PM IST

కొందరు పురుషుల్లో 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఈ సమస్య ప్రారంభమౌతుండగా.. కొందరికి మాత్రం 70ఏళ్ల తర్వాత మొదలౌతోందట.

మోనోపాజ్.. ఈ పేరు ఎక్కువగా వింటూనే ఉంటాం.40ఏళ్ల దాటిన ప్రతి మహిళకు ఈ స్టేజ్ ఎదురౌతూనే ఉంటుంది. ఈ స్టేజ్ కి చేరుకోగానే వారిలో హార్మోన్లలో మార్పులు చోటుచేసుకుంటాయి. కొందరు పీరియడ్స్ రావడం ఆగిపోతాయి. అంటే అప్పటి నుంచి వారు ఇక సంతానం కనగలే సత్తాని కోల్పోతారు. ఇంకా చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. దీనిపై చాలా మందికి అవగాహన ఉంది.
మరి ఇలాంటి మార్పులు పురుషుల్లోనూ చోటుచేసుకుంటాయా..? పురుషుల్లోనూ మోనోపాజ్ అంటూ ఓ దశ ఉంటుందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది.

పురుషుల్లో టెస్టోస్టెరాజ్ అనే హార్మోన్ విడుదల అవ్వడం తగ్గిపోతుంది. దానినే వారిలో మోనోపాజ్ దశగా గుర్తించాలి. దాదాపు నూటికి 30శాతం మంది పురుషులు 50 సంవత్సరాలు దాటగానే.. ఈ తరహా సమస్యతో బాధపడుతున్నారట.
కొందరు పురుషుల్లో 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఈ సమస్య ప్రారంభమౌతుండగా.. కొందరికి మాత్రం 70ఏళ్ల తర్వాత మొదలౌతోందట.
అయితే.. ఈ సమస్య అందరి పురుషుల్లోనూ వస్తుందని చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వారు శృంగారానికి, సంతానం పొందడానికి పనికి రారు అని కూడా తేల్చి చెప్పలేమని అంటున్నారు.
అయితే... శృంగార సమస్యలు మాత్రం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వారి వయసు పెరుగుతున్న కొద్ది ఈ రకమైన సమస్యలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ముఖ్యంగా పురుషుల్లో హార్మోన్లు తగ్గిపోతాయి. దీంతో.. వారికి శృంగారంలో పాల్గొనాలనే ఆసక్తి కూడా తగ్గిపోతుంది.
తరచూ అంగస్తంభనకు గురయ్యే అవకాశం ఉంటుంది.
మజిల్ స్ట్రెంత్ కూడా తగ్గిపోతుంది. ఇది మోనోపాజ్ ప్రధాన లక్షణం.
బాడీ అవుటర్ లుక్ కూడా మారిపోతుంది. శరీరంలో కొవ్వు బాగా పెరిగిపోతుంది. పొట్ట పెరగడం.. లావు గా మారడం లాంటివి జరుగుతాయి.
ఈ విషయంలో ఏవైనా అనుమానం కలిగితే.. వైద్యులను సంప్రదించి.. సరైన టెస్టుల ద్వారా చికిత్స ను గుర్తించవచ్చు.
అయితే... ఈ సమస్యను కొన్ని రకాల ఆహారాలతో పరిష్కరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. కూరగాయలు, పండ్లు లాంటి ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.
జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. కూరగాయలు, పండ్లు లాంటి ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.
ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. దాని వల్ల స్ట్రాంగ్ గా మారడంతోపాటు.. శరీరంలో రోగ నిరోధక శక్తికూడా పెరుగుతుందని సూచిస్తున్నారు.
అంతేకాకుండా రోజుకి 8 గంటలపాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇది కూడా చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

Latest Videos

click me!