క్షమించండి అని చెప్పడం, మీరు తప్పు చేసినప్పుడు వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించడం చాలా కామన్. లేదంటే.. తగాదాను నివారించడానికి ఎల్లప్పుడూ క్షమాపణలు చెప్పడం మరొక విషయం. కానీ..మీ భాగస్వామి మీ భావాలను పట్టించుకోకుండా నిరంతరం సంబంధాన్ని కాపాడుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నట్లయితే, విషయాలను లోతుగా పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు బంధం కాపాడుకోవడానికి క్షమాపణలు చెబుతున్నారు.. కానీ వారు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి.