శృంగారంలో ఈ పద్దతి కూడా సేఫ్ కాదా?

First Published Nov 10, 2023, 2:35 PM IST

పుల్ అవుట్ పద్దతి ఎంతో సేఫ్ అని చాలా మంది భావిస్తుంటారు. నిపుణులు ప్రకారం.. ఇది కూడా సేఫ్ కాదు. దీనివల్ల కూడా ఎన్నో లైంగిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఈ పద్దతిలో కూడా గర్భం దాల్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

సెక్స్ సమయంలో కండోమ్స్ ను ఉపయోగించనప్పుడు.. పుల్ అవుట్ పద్దతిని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. నిజానికి ఇది పాత విధానం. దీన్ని సాధారణంగా గర్భధారణను నివారించడానికి గర్భనిరోధకంగా ఉపయోగిస్తారు. ఇది నిజంగా గర్భనిరోధకంగా పనిచేస్తే కండోమ్ లను, మాత్రలు వంటి వాటిని ఎందుకు ఉపయోగిస్తారు. నిపుణుల ప్రకారం.. పుల్ అవుట్ పద్ధతి ఏ విధంగానూ గర్భనిరోధకం కాదు. అసలు పుల్ అవుట్ పద్దతి మీకు ఉపయోగపడుతుందా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

అప్పుడు పుల్ అవుట్ పద్ధతి సురక్షితమేనా? 

అండోత్సర్గము తర్వాత లేదా ముందు పుల్ అవుట్ పద్ధతి అస్సలు సురక్షితం కాదని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా అండోత్సర్గము టైంలో ఈ పద్ధతిని అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఈ సమయంలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం అండోత్సర్గము సమయంలోనే కాదు ఏ సమయంలోనూ గర్భనిరోధక పద్ధతిగా ఉపయోగించడం సేఫ్ కాదు. 
 

పుల్ అవుట్ పద్ధతి పూర్తిగా పురుషులపై ఆధారపడి ఉంటుంది. ఏ మాత్రం లేట్ చేసినా.. వీర్యం అండంలోకి వెళ్లే అవకాశం ఉంది. కాగా చాలా మంది మహిళలు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల స్ఖలనం ద్రవం వల్ల కూడా గర్భం ధరిస్తారు. 

sex life

యూటీఐకి అతిపెద్ద కారణం 

పుల్ అవుట్ పద్ధతి ఏ విధంగానూ సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. పుల్ అవుట్ పద్ధతి సమయంలో ఎస్టిఐ అంటే లైంగికంగా సంక్రమించే సంక్రమణ ప్రమాదం పెరుగుతుందట. ఈ పద్ధతిలో లైంగిక కార్యకలాపాల సమయంలో మీకు మీ భాగస్వామికి మధ్య ఎలాంటి అవరోధం ఉందదు. అలాగే చర్మం ప్రత్యక్ష సంబంధంలోకి వచ్చినప్పుడు బ్యాక్టీరియా వారి నుంచి మీకు వ్యాపించే ప్రమాదం ఉంది. 

Image: Getty Images

అలాగే మీ భాగస్వామి నుంచి బ్యాక్టీరియా, క్రిములు యోనిలోకి ప్రవేశిస్తాయి. దీంతో ఇద్దరు భాగస్వాములు యూటీఐ బారిన పడే ప్రమాదం ఉంది. అంతేకాదు హెచ్ఐవి హెర్పెస్ వంటి భయంకరమైన లైంగిక సంక్రమణ అంటువ్యాధుల ప్రమాదం కూడా ఉంది.0
 

Image: Getty Images

గర్భధారణకు కారణమవుతుందా? 

స్ఖలనానికి ముందు ద్రవంలో స్పెర్మ్ ఉండదు. కానీ ప్రీకోగ్యులెంట్ ద్రవం స్పెర్మ్ తో సంబంధంలోకి వస్తుంది. పరిశోధనల ప్రకారం.. స్ఖలనానికి ముందు ద్రవంలో వీర్యం ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైన వ్యక్తిలో స్ఖలనానికి ముందు ద్రవంలో 16.7% వరకు స్పెర్మ్ ఉందని ఒక అధ్యయనం కనుగొంది. అవాంఛిత గర్భధారణను నివారించాలనుకుంటే కండోమ్ లను వాడటం ఉత్తమం. 
 

Image: Getty Images

చాలా మంది పుల్ అవుట్ పద్ధతిని ఎంతో ఆహ్లాదకరంగా భావిస్తారు. ఇనీ ఇది అలా కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ పద్ధతిలో వ్యక్తులు పూర్తిగా సంతృప్తి చెందరు. స్ఖలనం చేసే సమయం చాలా మంచిదని గైనకాలజిస్టులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో మీ భాగస్వామి మానసికంగా సెక్స్ పై దృష్టి పెట్టకుండా ఈ పద్దతిపై పెట్టినప్పుడు వారు సెక్స్ ను పూర్తిగా ఆస్వాధించలేరు. లేదా మీ భాగస్వామి ఆ ఆనందాన్ని పొందలేరు. 
 

click me!