ఇలాంటి అబ్బాయిలను ఏ అమ్మాయీ భరించలేదు

First Published | Nov 29, 2023, 11:51 AM IST

ఏదేమైనా వైవాహిక జీవితంలో గొడవలు, కొట్లాటలు చాలా కామన్. ఇలాంటి విషయాలకు విడిపోవాలని ఎవరూ అనుకోరు. కానీ పురుషులు చేసే కొన్ని పనుల వల్ల ఆడవారికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. వీటివల్ల వారి భర్తతో జీవించడం కష్టంగా కూడా అనిపిస్తుంటుంది. ఇవే వారు విడిపోవడానికి కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. 
 

వైవాహిక జీవితం కొందరికి సంతోషంగా ఉంటే.. మరికొందరికి మాత్రం సవాలుగా, పెద్ద ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా పురుషులు చేసే కొన్ని పనుల వల్ల, వారి ప్రవర్తన వల్ల. కొన్ని రకాల పనులు చేసే పురుషులతో వారి భార్యలు సంతోషంగా ఉండలేరు. అలాగే జీవితం కూడా కష్టంగా గడుస్తుందట. మరి ఎలాంటి పనులు ఆడవారికి ఇబ్బందిని కలిగిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

కమ్యూనికేషన్ లేకపోవడం

ఎలాంటి రిలేషన్ షిప్ అయినా సరే, భార్యాభర్తల సంబంధమైనా సరే.. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఉండాలి. కమ్యూనికేషన్ లేకపోతే గొడవలు, కొట్లాటలు వస్తాయి. అలాగే  ఇలాంటి భాగస్వామితో ఉండటం ఎంతో కష్టంగా ఉంటుంది. ఇలాంటి భర్తలో జీవించడం భార్యలకు ఇబ్బందిగా ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ సంబంధాన్ని బ్రేక్ చేస్తుంది. మీకు తెలుసా? కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అపార్థాలు వస్తాయి. భావోద్వేగ దూరం పెరుగుతుంది. 


విమర్శించడం

రిలేషన్ షిప్ మెరుగ్గా ఉండటానికి ఫీడ్ బ్యాక్ చాలా చాలా అవసరం. అలా అని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటాన్ని ఎవరూ ఇష్టపడరు. భర్త ఎప్పుడూ భార్యను విమర్శించడం,  లేదా అవమానించడం భార్యలకు అస్సలు న,చ్చదు. ఎందుకంటే ఇది వారి ఆత్మగౌరవాన్ని తగ్గించనట్టే అవుతుంది. ఇది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. ఇలాంటి వ్యక్తితో ఎందుకే జీవించాలి అనిపించేలా చేస్తుంది. అందుకే మీ బంధం బలంగా ఉండాలంటే ఇలాంటి తప్పులు చేయకండి. అలాగే ఒకరినొకరు గౌరవించుకోవాలి. మద్దతు కూడా ఉండాలి. 
 

నమ్మకం

ఏ బంధమైనా సరే కలకాలం సంతోషంగా ఉండాలంటే.. నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. కానీ రిలేషన్ షిప్ లో అవిశ్వాసమే ఈ నమ్మకాన్ని పోగొడుతుంది. ఇది ఎంతో బాధను కలిగిస్తుంది. భాగస్వామి వివాహేతర సంబంధాలను పెట్టుకుంటే లేదా ఎప్పుడూ సరిహద్దులు దాటితే వీరితో జీవించడం కష్టంగా అనిపిస్తుంది. అలాగే ఆ బంధం విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. 
 

వ్యక్తిత్వం

రిలేషన్ షిప్ బలంగా ఉండటానికి నమ్మకం, వ్యక్తిత్వం చాలా ముఖ్యం. అయితే కొంతమంది పురుషులు తమ భార్యల పనులను, నిర్ణయాలు లేదా ఇతర విషయాలను నియంత్రించాలనుంటారు. కానీ ఈ అలవాటు మంచిది కాదు. ఎందుకంటే ఇది మీరు చేస్తున్నది తప్పు అని అపరాధ భావన కలగొచ్చు. అలాగే మిమ్మల్ని తప్పుదారి పట్టించొచ్చు. ఇది మీకు స్వతంత్రతను లేకుండా చేస్తుంది. అలాగే మీ భావోద్వేగ శ్రేయస్సును బలహీనపరుస్తుంది. ఇలాంటి పనులు చేసే వారితో కలిసి జీవించడం చాలా కష్టం.

సహకారం

ఆరోగ్యకరమైన సంబంధాలకు రాజీ పడటం, సహకారం చాలా అవసరం. మీ భాగస్వామి మిమ్మల్ని గౌరవించకపోతే లేదా మీ అవసరాలను తీర్చలేకపోతే కూడా మీకు వాళ్లతో ఉండటం కష్టంగా ఉంటుంది.  పరస్పర సంతృప్తికి, ఎదుగుదలకు సహకారం చాలా అవసరం.
 

Latest Videos

click me!