లేట్ గా పెళ్లి చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

First Published | May 10, 2024, 9:50 AM IST

కేరీర్ అని, లక్ష్యాలని, ఆర్థికంగా స్థిరపడాలని చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు చాలా లేట్ గా పెళ్లి పీఠలెక్కుతున్నారు. కానీ ఇలా లేట్ గా పెళ్లి చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందో మీరు కూడా ఊహించలేరు. 
 

పెళ్లి గురించి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. చాలా మంది పెళ్లీడు రాగానే పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ కొంతమంది మాత్రం వీలైనంత లేట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటారు. దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఆర్థికంగా బాగుండాలని, లక్ష్యాలను సాధించాలని, కుటుంబ బాధ్యతలు ఇప్పుడే వద్దనుకుని, పెళ్లికి సిద్ధంగా లేనని ఎన్నో కారణాలను వెతుక్కుని లేట్ గా పెళ్లి చేసుకుంటుంటారు. కానీ లేట్ గా పెళ్లి చేసుకోవడం వల్ల మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే? 

మరింత బాధ్యత..

కుటుంబ బాధ్యతలను నేను ఇప్పుడే మోయలేనని చాలా మంది చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. కానీ ఆలస్యంగా పెళ్లయ్యాక దంపతులకే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ సమయంలో ఇద్దరి ప్రాధాన్యతలు కూడా మారడం మొదలవుతుంది.
 


పెరుగుతున్న గొడవలు..

ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత ఒక వ్యక్తిలో అహం స్థాయి బాగా పెరగడం ప్రారంభమవుతుందట. ఇలాంటి పరిస్థితిలో లేట్ గా పెళ్లి చేసుకోవడం వల్ల జంటలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం కంటే ఎక్కువగా గొడవ పడటం ప్రారంభిస్తారు. 

వంధ్యత్వ సమస్యలు

ప్రస్తుత కాలంలో చాలా మంది వంధ్యత్వ సమస్యలతో బాధపడుతున్నారు. వంధ్యత్వ సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ దీనికి లేటు వయసు కూడా ఒక కారణమే. మీకు తెలుసా? ఆడవాళ్లలో 30 ఏండ్ల  తర్వాత సంతానోత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది. అందుకే లేట్ గా పెళ్లి చేసుకుంటే మీరు గర్భవతి అయ్యే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.
 

తగ్గిన రొమాన్స్..

వృద్ధాప్యంతో మహిళలు శారీరక సాన్నిహిత్యాన్ని ఎక్కువగా అనుభవించరు. అంటే లేటు వయసులో ఆడవారికి సెక్స్ కోరికలు చాలా వరకు తగ్గుతాయి. అలాగే భాగస్వామితో సన్నిహితంగా ఉండటానికి ఇష్టపడరు. ఇలాంటి పరిస్థితుల్లో దంపతుల మధ్య గొడవలు మాత్రమే జరుగుతుంటాయి.
 

ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం

మరీ లేటు వయసులో పెళ్లి చేసుకుంటే కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితిలో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అస్సలు ప్రయత్నించరు. ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుతుంటారు.

కెరీర్ పై ఫోకస్..

ఆలస్యంగా పెళ్లి చేసుకున్నప్పుడు భార్యాభర్తలు తమ కెరీర్ పై ఎక్కువ దృష్టి పెడతారు. దీనివల్ల ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎక్కువ శ్రద్ధ చూపలేరు. ఒకరితో ఒకరు గడపడానికి బదులుగా ఎవరిపని వాళ్లు చూసుకుంటారు. దీనివల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉండదు. 
 


కుటుంబం నుంచి పిల్లల ఒత్తిడి..

చాలాసార్లు ఆలస్యంగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు త్వరగా బిడ్డను  కనాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరుగుతాయి. ఇద్దరి మధ్య సక్యత తగ్గుతుంది. వయస్సు పెరిగే కొద్దీ చాలా మంది ఒంటరిగా బతకడానికి అలవాటు పడతారు. ఇది వారి వివాహాన్ని ప్రభావితం చేస్తుంది.అందుకే వీలైనంత వరకు పెళ్లీడు రాగానే పెళ్లి చేసుకోవడం మంచిది. 

Latest Videos

click me!