ఫస్ట్ టైం సెక్స్.. ఆడవారికి ఎక్కువగా వచ్చే డౌట్లు, సమాధానాలు..!

First Published | Jul 30, 2023, 10:49 AM IST

సెక్స్ అంటే కేవలం శరారీక ఆనందమే కాదు అంతకు మించేనంటున్నారు నిపుణులు . ఇది ఇద్దరి మధ్య ప్రేమను, నమ్మకాన్ని పెంచుతుంది. వారిద్దరినీ భావోద్వేగంగా మరింత దగ్గర చేస్తుంది.
 

Image: Getty

సెక్స్ చేసేటప్పుడు బట్టలు విప్పడం అవసరమా? బెడ్ పై తెల్లని వస్త్రం ఖచ్చితంగా ఉండాలా? వంటి ఎన్నోప్రశ్నలు టీనేజర్లకే కాదు పెద్దలకు కూడా వస్తాయి. అయితే మొదటిసారి శృంగారంలో పాల్గొనడానికి సరైన వయసు ఏది అనే ప్రశ్న ఎవరి మదిలోనూ రాదు. కానీ మొదటిసారి సెక్స్ లో పాల్గొనేటప్పుడు అమ్మాయిల మనస్సులో ఎన్నో సందేహాలు, మరెన్నో భయాలు కలుగుతుంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

శృంగారానికి సరైన వయస్సు ఏది?

లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ చేసిన పరిశోధన ప్రకారం.. 18 ఏళ్ల వయసు మొదటిసారి శృంగారంలో పాల్గొనడానికి అనువైనది. స్త్రీలైనా పురుషులైనా ఇద్దరూ ఈ వయసులో లైంగికంగా చురుగ్గా ఉంటారట. శాస్త్రీయంగా 18 సంవత్సరాల కంటే ముందు సెక్స్ మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా ప్రభావితం చేస్తుంది. మొదటిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు అమ్మాయిల మదిలో ఎలాంటి ప్రశ్నలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


మొదటిసారి సెక్స్ వల్ల నొప్పి ఉంటుందా? 

నిపుణుల ప్రకారం.. ప్రతి అమ్మాయికి దీనికి సమాధానం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే సెక్స్ సమయంలో  కొంతమంది అమ్మాయిలు మొదటిసారి సెక్స్ లో పాల్గొనప్పుడు నొప్పి ఉంటుంది. కొంతమందికి ఉండకపోవచ్చు. అయితే ఈ నొప్పికి కారణం హైమెన్ కావొచ్చు. హైమెన్ చిరగడం వల్ల నొప్పి కలుగుతుంది. కానీ సంభోగం సమయంలో ఈ హైమెన్ చిరిగినప్పుడు కొద్దిగా రక్తస్రావం, నొప్పి ఉండొచ్చు. అయితే ఈ హైమన్ ఆటలు, కొన్ని పనుల వల్ల కూడా చిరిగిపోతుందన్న సంగతిని గుర్తుంచుకోవాలి. 

శృంగారానికి ముందు మీ భాగస్వామితో దీని గురించి మాట్లాడటం మంచిదేనా?

మీ మనసులో ఏముందో మీ భాగస్వామికి చెప్పడానికి అస్సలు భయపడకండి. మీరు మీ శరీరాన్ని వారితో పంచుకోబోతున్నారు. కాబట్టి మీ శరీరం ఎలా భావిస్తుందో వారికి చెప్పడంలో తప్పులేదు. కాబట్టి మొదటిసారి శృంగారంలో పాల్గొనే ముందు సిగ్గుపడటానికి బదులు మీకు భయంగా అనిపిస్తే నిస్సందేహంగా వారితో చెప్పండి. 
 

శృంగారానికి సరైన పొజీషన్ ఏది?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సరైన సెక్స్ భంగిమే మీకు సౌకర్యవంతంగా ఉంటుంది. మీరు మొదటిసారి సెక్స్ లో పాల్గొంటున్నప్పుడు ఒత్తిడికి గురైతే మీరు శృంగారాన్ని ఆస్వాదించలేరు. ఇది మీకు నొప్పిని కూడా కలిగిస్తుంది. అందుకే మొదటిసారి శృంగారాన్ని ఆస్వాదించాలంటే టెన్షన్ కు దూరంగా ఉండండి.
 

sex life

కండోమ్స్ ఖచ్చితంగా వాడాలా?  

నిపుణుల ప్రకారం.. కండోమ్లను ఉపయోగించడం చాలా మంచిది. ఎందుకంటే ఇది లైంగిక సంక్రమణ వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. అలాగే అవాంఛిత గర్భం రాకుండా నిరోధిస్తుంది. 
 

Image: Getty Images

శృంగారానికి ఫోర్ ప్లే అవసరమా? 

సెక్స్ కు ముందు ఫోర్ ప్లే చేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయి.  ఇది సెక్స్ సమయలో నొప్పిని తగ్గిస్తుంది. అంతేకాదు ఈ అనుభవం మీకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కూడా. అందుకే సెక్స్ కు ముందు ఫోర్ ప్లే లో పాల్గొనండి. ఫోర్ ప్లే మీ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. కాబట్టి దీని గురించి మీ భాగస్వామితో మాట్లాడండి. 
 

Image: Getty Images

పురుషాంగం యోనిలోకి సరిపోకపోతే?

ఇది 80 శాతం మంది అమ్మాయిలను వేధిస్తున్న ప్రశ్న ఇది. యోని గురించి తెలియకపోవడం వల్లే ఈ ప్రశ్న వస్తుందంటున్నారు నిపుణులు. ఇది ఒకే సమయంలో కనీసం 3.30 కిలోల పిల్లల బరువును తట్టుకోగలదు. సెక్స్‌కు ముందు మంచి లూబ్రికెంట్,  ఫోర్‌ప్లే ఉపయోగించండి.ఇది సెక్స్ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తుంది. 

Latest Videos

click me!