Relationship: గొడవ తర్వాత బాయ్ ఫ్రెండ్ కు సారీ చెప్పాలా.. అయితే ఇలా ప్రయత్నించండి?
Relationship: నేటి తరం ప్రేమికులు చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతున్నారు. అయితే కొందరు అర్థం చేసుకుని వెంటనే సర్దుకుని బంధాన్ని కాపాడుకుంటున్నారు. అలా గొడవ పడిన తరువాత బాయ్ ఫ్రెండ్ ని ఎలా కన్విన్స్ చేయాలో ఇక్కడ చూద్దాం.
సాధారణంగా గొడవ జరిగిన తర్వాత అయ్యో పొరపాటు చేశాను అని చాలా సందర్భాలలో అనిపిస్తుంది. కానీ అదే విషయాన్ని అవతలి వాళ్ళతో చెప్పటానికి సంకోచం అడ్డొస్తుంది. అలా అని జాప్యం చేస్తే బంధం పల్చబడిపోయే అవకాశాలు ఉంటాయి.
అందుకే గొడవ జరిగిన తరువాత తప్పు మీదనే గ్రహిస్తే అవతలి వ్యక్తిని ఎలా కాంప్రమైజ్ చేయాలనేది ఇక్కడ చూద్దాం. ముందు మీ భాగస్వామిని మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పండి. అతని సమక్షంలో చెప్పలేనప్పుడు మెసేజ్ పంపించి అయినా మీ యొక్క పశ్చాత్తాపాన్ని తెలియజేయండి.
మీరు అతనిని వదులుకోవటానికి సిద్ధపడుతున్నట్లుగా అతను భ్రమ పడకుండా చూసుకోవలసిన బాధ్యత మీదే కాబట్టి అతనిపై ఎక్కువ శ్రద్ధ చూపించండి. నువ్వు లేకుండా నేను ఉండలేను అనే విషయాన్ని అతనికి అర్థం అయ్యేలాగా ప్రవర్తించండి.
అతనితో కలిసి ఉండటం కోసం సర్దుబాటుకి సిద్ధంగా ఉన్నట్లు అతనికి తెలియజేయండి. మనం పడిన గొడవ మన ప్రేమ కన్నా ఎక్కువ కాదు కానీ మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ బలాన్ని అతనికి తెలియజేయండి. అదే సమయంలో ఇలాంటి గొడవ మీ నుంచి అతనికి ఎదురవ్వదు అనే నమ్మకాన్ని అతనికి కలిగించడానికి ప్రయత్నించండి.
క్షణికావేశంలో గొడవ జరిగింది తప్పితే పగ ప్రతీకారాలతో గొడవ జరగలేదని అతనికి నచ్చ చెప్పండి. ఒకవేళ నా వలన మీరు ఇబ్బందికి గురి అయినట్లయితే మీరు ఇచ్చే శిక్ష స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పండి.
అర్థం చేసుకునేవాడు, భరించేవాడు అయితే మీ అభ్యర్థనని మన్నించి మళ్లీ మీ దగ్గరికి వస్తాడు కాకపోతే ఆ సమయంలో మీరు మాట్లాడే ప్రతి మాట నిజాయితీగా ఉండాలి. మీ చూపులో నిజాయితీ మీ మాటలో పశ్చాత్తాపం అతనికి కనిపిస్తే కచ్చితంగా అతను మిమ్మల్ని క్షమిస్తాడు.