marriage
పెళ్లితో రెండు జీవితాలు ముడిపడతాయి. మునపటి లైఫ్ కు, వైవాహిక జీవితానికి ఎంతో తేడా ఉంటుందన్న ముచ్చటను తెలుసుకుంటారు. ఏదేమైనా ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోకతప్పదు. అలా అని ఎవరినో ఒకరిని చేసుకోవడంలో అర్థం లేదు. పెద్దల కోసమో.. ఒత్తిడి వల్లే మీరు పెళ్లి చేసుకుంటే మాత్రం జీవితంలో ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే పెళ్లి విషయంలో చాలా క్లారిటీగా ఉండాలి.
మీ ఆలోచనలను నిర్మొహమాటంగా మీరు మీ భాగస్వామికి చెప్పుకునేలా మీ వైవాహిక బంధం ఉండాలి. అలాగే మీ లోపాలను, బలాలను మీ భాగస్వామికి చూపించే విధంగా ఉండాలి. అలాగే మీ భాగస్వామి మీ మంచి, చెడు రెండు లక్షణాలను స్వీకరించేలా ఉండాలి. మిమ్మల్ని అర్థం చేసుకునే భాగస్వామి మీ జీవితంలోకి వస్తే మీ మ్యారేజ్ లైఫ్ అందంగా ముందుకు సాగుతుంది.
అయితే చాలా మందికి పెళ్లిపై ఒక క్లారిటీ ఉండదు. అంటే ఫ్యామిలీ వల్ల, ఒత్తిడి వల్లే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంటారు. కానీ దీనివల్ల మీ వైవాహిక జీవితం సాఫీగా సాగదు. అసలు మీరు పెళ్లి చేసుకోవడానికి మానసికంగా సిద్దంగా ఉన్నారా? లేదా? అనే విషయంలో క్లారిటీగా ఉండాలి. క్లారిటీ లేకుండా పెళ్లికి తొందర పడితే తర్వాత మీ బంధంలో గొడవలు, కొట్లాటలు వచ్చే అవకాశం ఉంది. అందుకే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడకండి. మీరు మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోండి. అసలు క్లారిటీ లేకుండా పెళ్లి ఎందుకు చేసుకోవద్దో ఇప్పుడు తెలుసుకుందాం..
marriage
మీరు పెళ్లిని ఎందుకు చేసుకోవాలనుకుంటారంటే?
ఒంటరిగా ఉన్నానని మీరు పెళ్లి చేసుకోవడానికి సిద్దపడొచ్చు. పెళ్లి చేసుకుంటే ఈ లోన్లీనెస్ తొలగిపోతుందని మీరు అనుకుంటారు. కానీ సరైన భాగస్వామిని ఎన్నుకోకపోతే మీరు ఒంటిరిగా ఫీలయ్యే అవకాశం ఉంది.
మీరు మీ వ్యక్తిగత సమస్యలను వదిలించుకోవాలనుకుంటున్నారు.
మీ ప్రస్తుత పరిస్థితి నుంచి పారిపోవాలనుకుంటున్నారు.
మీరు మీ తల్లిదండ్రులను, బంధువులను సంతోషపెట్టాలనుకుంటున్నారు.
సామాజిక ఒత్తిళ్లకు తలొగ్గి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు.
నేటి ట్రెండ్ కు అనుగుణంగా సోషల్ మీడియాలో ఆధిపత్యం చెలాయించడానికి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు.
marriage
పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటారంటే?
వివాహం వంటి జీవితకాల నిబద్ధతకు మీరు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నారు.
మీ వ్యక్తిగత జీవితంలో సంబంధాల ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకోవడం ప్రారంభించారు.
మీ జీవిత ప్రయాణాన్ని మీ భాగస్వామితో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
మీ జీవిత లక్ష్యాలు, మీ ఇష్టాలు, ఆసక్తులు జీవితంపై మీ వ్యక్తిగత అభిప్రాయాలకు పూర్తిగా భిన్నమైన వ్యక్తితో మీ గదిని పంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు.