father son
పిల్లలు ఎలా పెరుగుతున్నారనే విషయంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా మగ పిల్లల విషయంలో.. తండ్రి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. మగ పిల్లలకు ఖచ్చితంగా తండ్రి సూచనలు చాలా అవసరమట. ప్రతి కొడుకు.. తన తండ్రి దగ్గర నుంచి ఈ కింద విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలట. మరి అవేంటో ఓసారి చూద్దాం..
ఇతరుల కంటే మీ ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వడం..
స్వీయ ప్రాధాన్యత ఇవ్వడం మంచిది కాదు కానీ చాలా అత్యవసరం అని మీ కొడుకు తెలుసుకోవడం ముఖ్యం. మన సమాజం పురుషాధిక్యత ఎక్కువగా కలిగి ఉందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. పురుషులపై అధిక భారం ఉంటుంది. అబ్బాయిలు అంటే ఇలానే ఉండాలి.. ఇలానే చేయాలి అనే నమ్మకం అందరిలోనూ పాతుకుపోయింది. ఆ ఒత్తిడి మీ కొడుకు మీద పడకుండా చూడాల్సిన బాధ్యత తండ్రి మీద మాత్రమే ఉంది. తమకు సంతోషాన్ని ఇచ్చే దానిపై కూడా ఎలా దృష్టి పెట్టాలి అనే విషయాన్ని తండ్రి కొడుక్కి చెప్పాలట.
మీరు ఆశించేది ఇవ్వండి
మీరు ఎవరితో ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలానే ఉండాలట. ఇది. జీవితంలోని అన్ని రంగాలలో ప్రతిచోటా పని చేసే మొదటి ప్రధానమైన నియమం. ఇది పిల్లలలో సంఘం, విధేయత యొక్క ఆలోచనలను ప్రేరేపించడంలో కూడా సహాయపడుతుంది.
ప్రపంచం మొత్తం గులాబీ బాటలా ఉంటుందని చాలా మంది పిల్లలు అనుకుంటూ ఉంటారు. ఏదైనా తప్పు జరిగితే.. అది తమ పొరపాటుగా భావిస్తూ ఉంటారు. ఆ సమయంలో.. అది వారి తప్పు వల్ల జరిగింది కాదనే విషయం తండ్రి కొడుక్కి చెప్పాలట. బయట ప్రపంచం ఎలా ఉంటుందనే విషయం కచ్చితంగా చెప్పాలట.
చాలా మంది పేరెంట్స్.. తమ పిల్లలకు తమ ప్రేమను తెలియజేయరు. ఎందుకంటే.. మా జెనరేషన్ వేరు.. అలా చెప్పరు అంటూ సాకులు చెబుతూ ఉంటారు. కానీ.. పిల్లలను మీరు ఎంత ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని తెలియజేయాలట. వారికి ఐలవ్ యూ చెప్పడం... వారిని మీరు ఎంత అర్థం చేసుకుంటున్నారు అనే విషయాన్ని వారికి చెప్పాలట.
మనం ఎవరినైనా బాధపెడితే.. వారు తిరిగి మనల్ని బాధ పెడతారు. ఈ విషయాన్ని మనం పిల్లలకు కచ్చితంగా చెప్పాలట. ఈ విషయం కనుక పిల్లలకు తెలిస్తే.. ఎదుటివారిని ఇబ్బంది పెట్టి.. తర్వాత వారు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఈ విషయాన్ని కూడా తండ్రి కచ్చితంగా తమ కుమారుడికి నేర్పించాలట.
పిల్లలకు వారిలో మరింత ఎక్కువ సామర్థ్యం ఉందనే విషయాన్ని ప్రతిసారీ చెబుతూ ఉండాలట. పిల్లలు ఏం చేసినా.. ఇంకా చేయగలరని.. వారిలో ఇంకా ఎక్కువ టాలెంట్ ఉందని మీరు ప్రోత్సహించాలి. అప్పుడు వారు మరింత మెరుగ్గా తయారౌతారట.