గర్భిణులు ఒత్తిడికి గురైతే.. బిడ్డకు ఎన్ని సమస్యలొస్తయో తెలుసా?

Published : Apr 22, 2023, 03:43 PM IST

ప్రెగ్నెన్సీ వల్ల ఆడవారి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా హార్మోన్లు అసమతుల్యంగా ఉంటాయి. ఈ సమయంలో చాలా మంది ఒత్తిడికి లోనవుతారు. కానీ వీళ్లు ఒత్తిడికి గురైతే పుట్టబోయే బిడ్డకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 

PREV
110
గర్భిణులు ఒత్తిడికి గురైతే.. బిడ్డకు ఎన్ని సమస్యలొస్తయో తెలుసా?

ప్రెగ్నెన్సీ సమయంలో ఒత్తిడికి గురికావడం సాధారణం. అయితే ఈ సమయంలో ఆడవారి శరీరం ఎన్నో రకాల మార్పులకు లోనవుతుంది. కొన్నిసార్లు పాదాల వాపు రావడం, కొన్నిసార్లు చేతులలో దురద పెట్టడం, కొన్నిసార్లు ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే ప్రతి గర్భిణిలో ఈ లక్షణాలే ఉండకపోవచ్చు. ఒక్కొక్కరికీ ఈ సమయంలో ఒక్కోలా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారి శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. హార్మోన్లలో మార్పులు కూడా వస్తాయి. ఇది మారి మానసిక స్థితిని మారుస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

210
Post pregnancy fatigue

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. చిన్న చిన్న విషయాలు మనల్ని ఇబ్బంది పెడతాయి. ఈ సమయంలో మీరు ఎక్కువ ఒత్తిడికి గురైతే నిద్రలేమి, తలనొప్పి, ఆహార కోరికల సమస్యలు వస్తాయి. ఇది  తల్లీబిడ్డల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
 

310
pregnancy

యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ప్రకారం.. ఈ లక్షణాలు గర్భిణీ స్త్రీలో ఒత్తిడిని అంచనా వేయడానికి సహాయపడతాయి.

ప్రతి దాని గురించి ఆందోళన చెందడం. దాని గురించి చాలాసేపు ఆలోచించడం.
ఎప్పుడో జరిగిపోయిన పాత విషయాలను గుర్తుచేసుకోవడం. 
పీడకలలు, నిద్ర లేకపోవడం
నచ్చని వ్యక్తులకు దూరంగా ఉండటం. 
అపరాధ భావన
 

410
pregnancy

గర్భధారణ సమయంలో ఒత్తిడి స్త్రీ శరీరాన్ని రెండు విధాలుగా ప్రభావితం చేస్తుంది ఒకటి..

ప్రత్యేక్షంగా: ఒత్తిడి కారణంగా శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఇది పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఈ హార్మోన్ పిల్లల మెదడును కూడా ప్రభావితం చేస్తుంది. అంతేకాదు ప్రెగ్నెన్సీ సమయంలో స్మోకింగ్ చేస్తే మీ శరీర ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. 
 

510

పరోక్షంగా: దీనిలో గర్భిణీ స్త్రీ ఒత్తిడి ప్రభావం ఆమె శరీరంపై కనిపిస్తుంది. శారీరకంగా ఆమెకు ఎన్నో వ్యాధులు సోకుతాయి. ఈ కారణంగా అకాల ప్రసవం ప్రమాదం కూడా పెరుగుతుంది. ఎన్ఐసిహెచ్డి ప్రకారం.. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అకాల పుట్టుక లేదా తక్కువ జనన బరువు ప్రమాదాన్ని పెంచుతుంది.
 

610

పిల్లలలో సున్నితత్వం 

గర్భిణులు ఒత్తిడికి గురైతే పిల్లలు పెద్దయ్యాక హైపర్సెన్సిటివ్ గా మారే అవకాశం ఉంది. ఇలాంటి పిల్లలు ప్రతి విషయానికి ఇబ్బంది పడతారు. దీనివల్ల మరిన్ని సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే పిల్లలు మానసికంగా మరింత సున్నితంగా ఉండే అవకాశం ఉంది.
 

710

పుట్టిన తర్వాత వ్యాధులు రావొచ్చు

ఎన్ఐహెచ్ అధ్యయనం ప్రకారం.. గర్భధారణ సమయంలో ఒత్తిడి కారణంగా.. పిల్లలు పుట్టినప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లకు గురవుతారు. తల్లి ఒత్తిడికి గురైతే అది పిల్లల రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. అంటే పిల్లల్లో రోగనిరోధక శక్తి  తగ్గుతుంది. 
 

810

అభివృద్ధిలో జాప్యం

ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారు ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. దీని ప్రభావం పిల్లల ఎదుగుదలపై కూడా కనిపిస్తుంది. అంటే దీనివల్ల మీ పిల్లలు ప్రతిదానికి లేట్ గా రెస్పాండ్ అవుతారు. అంతేకాదు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి కూడా సమయం పడుతుంది. అలాంటి పిల్లలు ప్రతి విషయాన్ని ఆలస్యం చేస్తారు.
 

910

ఇతరులతో కలవలేరు

దీని ప్రభావం పిల్లల మానసిక ఎదుగుదలపై కూడా కనిపిస్తుంది. అంటే మీ పిల్లల ప్రవర్తణ ఇతరుల ముందు సరిగ్గా ఉండదు. అంతేకాదు ఇతరులతో కలవడానికి, సంబంధాలను పెంపొందించుకోవడానికి కూడా చాలా సమయం తీసుకుంటారు. 

1010
pregnancy

గర్భధారణ సమయంలో మహిళలు తమను తాము ఎలా చూసుకోవాలి? 

ధ్యానం చేస్తే గర్భిణుల ఆరోగ్యం బాగుంటుంది. మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. దీని వల్ల మీ చుట్టూ వ్యాపించే నెగిటివిటీ మీపై ప్రభావం చూపదు. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే చెడు ఆలోచనలను కూడా దూరం చేసుకోవచ్చు.

ప్రొఫెషనల్ థెరపిస్ట్ సహాయంతో ఒత్తిడిని తగ్గించడానికి చికిత్స తీసుకోండి. ఇది మీకు రోజంతా రిలాక్స్ గా అనిపిస్తుంది.

ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. గర్భధారణ సమయంలో వీరికి ఎక్కువగా ఆకలి అవుతుంది. ఇలాంటప్పుడు మీరు ఆరోగ్యకరమైన, పోషకాహాన్ని మాత్రమే తినండి. స్పైసీ ఫుడ్ ను ఎక్కువగా తినడం మానుకోండి.

యోగా మన మానసిక ఆరోగ్యానికి ఎంతో  సహాయపడుతుంది. ఒత్తిడిగా అనిపించినప్పుడు యోగా చేయండి. 
 

click me!

Recommended Stories