వైఎస్ షర్మిల'తెలంగాణ' పట్టు: బెంగుళూరుకు ఆమెకు మాత్రమే అనుమతి

First Published Jul 19, 2023, 10:37 AM IST

వైఎస్ షర్మిల తాను తెలంగాణ కోడలినని చెబుకుంటున్నప్పటికీ ఆమె ఆంధ్ర ముద్ర తొలగిపోలేదని అంటున్నారు. అందువల్ల తెలంగాణ ప్రజలు ఆమెను అంగీకరించే పరిస్థితిలో లేరనే వాదన వినిపిస్తోంది.  

sharmila dk shiva kumar

వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి సిద్ధపడినట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానంతో బెంగుళూరులో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల సమావేశం సందర్భంగా ఆమె ఈ చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ అందుకు వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది.

YS Sharmila


నిజానికి, సోనియా, రాహుల్ గాంధీలతో పాటు ఇతర అధిష్టానం నేతలను కలవడానికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు బెంగుళూరు వెళ్లడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే, బెంగుళూరు రావద్దని వారికి అధిష్టానం పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. వైఎస్ షర్మిలను మాత్రమే బెంగుళూరుకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా వైఎస్ షర్మిల డికె శివకుమార్ తో భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది. 

Revanth reddy , sharmila

తమ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేసుకోవడానికి అంగీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేవలు అందించాలని కాంగ్రెస్ పెద్దలు షర్మిలను అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, తాను తెలంగాణలో మాత్రమే పనిచేస్తానని ఆమె పట్టుబడుతున్నారని సమాచారం. కాగా, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా కొద్ది మంది నాయకులు షర్మిల పార్టీ విలీనాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని పొందిన ప్రజా వ్యతిరేక ఫలితాన్ని వారు గుర్తు చేస్తున్నారని సమాచారం. 

Telangana, Hyderabad, YS Sharmila, YSRTP, TRS, BRS, CM KCR,


వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురిగా షర్మిలకు గౌరవం ఇస్తామని, కానీ తెలంగాణలో ఆమె వల్ల ప్రయోజనం లేకపోగా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని అంటున్నారు. వైఎస్ షర్మిల తాను తెలంగాణ కోడలినని చెబుకుంటున్నప్పటికీ ఆమె ఆంధ్ర ముద్ర తొలగిపోలేదని అంటున్నారు. అందువల్ల తెలంగాణ ప్రజలు ఆమెను అంగీకరించే పరిస్థితిలో లేరనే వాదన వినిపిస్తోంది. 

ys sharmila

అయితే, వ్యూహకర్త సునీల్ కనుగోలు మాత్రం షర్మిల పార్టీని విలీనం చేసుకుంటే తెలంగాణలో కొంత మేరకు కాంగ్రెస్ కు ప్రయోజనం కలిగే అవకాశాలున్నాయని అధిష్టానానికి సూచించినట్లు తెలుస్తోంది. ఆమె వల్ల ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ కు ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారని సమాచారం. ఈ మేరకు ఆయన అధిష్టానానికి ఓ నివేదిక సమర్పించారని కూడా సమాచారం

revanth komati reddy


తెలంగాణలో మాత్రమే పనిచేయడానికి షర్మిల అంగీకరిస్తే తెలంగాణ కాంగ్రెస్ లో మరో అధికార కేంద్రం ఏర్పడుతుందనే భయాలు కూడా పార్టీ సీనియర్ నాయకుల్లో ఉంది. రేవంత్ రెడ్డికి అదే భయం ఉన్నట్లు చెబుతున్నారు. భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి మాత్రం షర్మిలను తెలంగాణ కాంగ్రెస్ లోకి ఆహ్వానించడానికి సముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు, విధేయుడిగా ఉండడం అందుకు కారణమని సమాచారం. 

click me!