వైఎస్ జగన్ హిట్ లిస్ట్: ఆ 18 మంది ఎమ్మెల్యేలు వీరేనా?

First Published | Jun 23, 2023, 10:06 AM IST

వైసీపీలో 18 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని జగన్ చేసిన హెచ్చరిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ లిస్ట్ లో ఉన్నదీ వీరే అంటూ సోషల్ మీడియాలో కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. అందులో ఎవరెవరు ఉన్నారంటే... 

ys jagan

హైదరాబాద్: వైఎస్ జగన్ ఇటీవల చేసిన ప్రకటనపై దుమారం చెలరేగుతోంది. పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదని, వారు గడప గడపకూ కార్యక్రమం చేపట్టలేదని ఆయన అన్నారు. వారితో తాను మాట్లాడుతానని చెప్పారు. జగన్ హిట్ లిస్టులో ఉన్న ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరనేది ఇప్పుడు చర్చగా మారింది. వారు పేర్లు బయట పెట్టనని జగన్ చెప్పడంతో మరింత ఉత్కంఠ రేగుతోంది.

roja

దాంతో గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొనని పార్టీ ఎమ్మెల్యేల పేర్లు, ఇంచార్జీల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఎంత వరకు నిజం ఉందనేది నిర్ధారించలేం గానీ మంత్రుల్లో గుడివాడ అమర్నాథ్, విశ్వరూప్, జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, రోజా తదితరుల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి


balineni srinivasa reddy

అలాగే మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మేకతోటి సుచరిత, అవంతి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, పాముల పుష్పశ్రీవాణి కూడా గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనలేదని జగన్ కు నివేదికలు అందినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. శాసనసభ్యుల్లో గ్రంథి శ్రీనివాస్ రావు, వసంత క్రిష్ణప్రసాదత్, కోలగట్ల వీరభద్రస్వామి, ఆళ్ల రామక్రిష్ణారెడ్డి, రెడ్డి శాంతి గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

peddireddy

మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ కూడా గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొనగడం లేదని అంటున్నారు. వీరిలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణలకు జగన్ మినహాయింపు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అలాగే స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం లేదని సమాచారం. 

ys jagan

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం లేదని జగన్ మొదట 60 నుంచి 70 మంది ఎమ్యెల్యేల పేర్లు బయట పెట్టారు. దాన్ని 42కు కుదించారు. ఆ తర్వాత తాజాగా 18 మంది ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమంలో పాల్గొనడం లేదని చెప్పారు. వారి పేర్లను బోర్డుపై ప్రదర్శించబోనని, వారితో తాను వ్యక్తిగతంగా మాట్లాడుతానని చెప్పారు. 

Prashant kishor

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు చెందిన IPAC గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనని ఎమ్మెల్యేల పేర్లను జగన్ కు అందించినట్లు తెలుస్తోంది. ఆ కార్యక్రమంలో పాల్గొనని ఎమ్మెల్యేలకు, మంత్రులకు జగన్ టికెట్లు నిరాకరిస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే, వివిధ సమీకరణాల నేపథ్యంలో, ఆయా ఎమ్మెల్యేల బలాల వల్ల అది సాధ్యం కాకపోవచ్చునని అంటున్నారు.

Latest Videos

click me!