పవన్ కల్యాణ్ ఆప్షన్స్: చంద్రబాబుకు ఖేదం, జగన్ కు మోదం

First Published Jun 7, 2022, 1:53 PM IST

అధికార వైసిపిని గద్దె దింపడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని ప్రయత్నిస్తున్నారు... కానీ పొత్తుల విషయంలో ఓ క్లారిటీకి రాలేకపోతున్నాయి. ఈ పొత్తుల విషయంలో ప్రతిపక్షాల మాటలయుద్దం వైసిపి కలిసివస్తే ప్రధాన ప్రతిపక్షం టిడిపిని కాస్త ఇరకాటంలో పెడుతున్నాయి.  

pawan kalyan chandrababu

వార్ వన్ సైడ్ అంటూ తాను చేసిన వ్యాఖ్యలు టిడిపి అధినేత నారా చంద్రబాబుకు చిక్కులు తెచ్చిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వైసిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడంలో ఆ చిక్కులు కలిగే అవకాశం ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి జగన్ ను ఎదుర్కోవాలని చంద్రబాబు గతంలో భావించారు. జనసేనతో పొత్తు కావాలని ఆశించారు. పవన్ కల్యాణ్ నుంచి స్పందన లేకపోవడంతో లవ్ వన్ సైడ్ అన్నారు. అయితే, టిడిపితో పొత్తు ఉండదని గానీ ఉంటుందని గానీ చెప్పకుండా పొత్తులకు తాను తెరిచే ఉంచినట్లు గతంలో పవన్ కల్యాణ్ సంకేతాలు ఇచ్చారు. దీంతో పవన్ కల్యాణ్ తమతో కలిసి వస్తారని చంద్రబాబు భావించారు.

pawan babu

 అయితే, నెల్లూరులో జరిగిన మహానాడు అనూహ్యమైన రీతిలో విజయవంతం కావడంతో చంద్రబాబులో విశ్వాసం పెరిగినట్లుంది. దాంతో ఆయన వార్ వన్ సైడ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. దాంతోనే పవన్ కల్యాణ్ కు మండినట్లుంది. అందుకే పొత్తులకు ఎజెండాను తాను సెట్ చేశారు. పొత్తులకు మూడు షరతులు పెట్టారు. ఈ మూడింట్లోనూ జనసేనదే పైచేయి కావాలన్నట్లుగా చెప్పారు. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించాలని ఆయన చెప్పకనే చెప్పారు. 2014లోనూ 2019లోనూ తాము తగ్గామని, ఇప్పుడు ఇతరులు తగ్గాలని, ఈసారి తాము తగ్గేది లేదని అనడం ద్వారా ఆ సంకేతాలను ఇచ్చారు. అది చంద్రబాబును ఉద్దేశించి అన్నట్లుగానే భావించాలి.

somu veerraju, chandrababu, pawan kalyan

జనసేనతో కలిసి తాము పోటీ చేస్తామని, పవన్ కల్యాణ్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అందువల్ల బిజెపికి ఆయన షరతులు పెట్టాల్సిన అవసరం లేదు. టిడిపికే ఆ పవన్ కల్యాణ్ ఆ మూడు ప్రత్యామ్నాయాలను పెట్టడంతో పాటు తమకు సిఎం పదవి ఇవ్వడానికి సిద్ధపడాలని ఆయన ఈసారి ఇతరులు త్యాగం చేయాలని చెప్పారు. అయితే చంద్రబాబు అందుకు సిద్ధపడాతారా అనేది సందేహమే. ఆయన ఏ మాత్రం అందుకు అంగీకరించరపోవచ్చు.

JP Nadda

పవన్ కల్యాణ్ ప్రకటన పరిణామాన్ని బిజెపి జాగ్రత్తగా గమనిస్తోంది. బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన నడ్డా పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించారు. పవన్ కల్యాణ్ ప్రత్యామ్నాయాలపై చంద్రబాబు ప్రతిస్పందించేంత వరకు ఏమీ మాట్లాడకూడదనేది నడ్డా ఉద్దేశం కావచ్చు. జగన్ ను ఓడించాలంటే ప్రతిపక్షాల ఓట్లు చీలకూడదనేది అందరి అభిప్రాయంగా కనిపిస్తోంది. చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో పవన్ కల్యాణ్ చంద్రబాబు పరీక్ష పెట్టినట్లే భావించాలి. 

pawan kalyan, chandrababu

పవన్ కల్యాణ్ షరతులను టిడిపి క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఆ విషయాన్ని తెలియజేస్తోంది. 2014లో పవన్ కల్యాణ్ బేషరతుగా చంద్రబాబుకు మద్దతిచ్చారు. దాంతో టిడిపి, బిజెపి కూటమి గెలిచింది. 2019 ఎన్నికల్లో మూడు పార్టీలు కూడా విడివిడిగా పోటీ చేశాయి. దీంతో పాటు ఇతర కారణాల వల్ల వైసిపి ఘనవిజయం సాధించింది. టిడిపికి దాదాపుగా 40 శాతం ఓట్లు వచ్చాయి. జనసేనకు 7 శాతం ఓట్లు వచ్చాయి. బిజెపికి 1 శాతం ఓట్లు వచ్చాయి. ఈ స్థితిలో 7 శాతం ఓట్లు వచ్చిన జనసేనకు చంద్రబాబు అవకాశం ఇస్తారా అంటే ఇవ్వరనే చెప్పాల్సి వస్తుంది. 

pawan chandrababu, ys jagan

జనసేన, బిజెపి ఓట్లు చీల్చుకుంటే టిడిపి విజయం సాధించడం కష్టం. జయాపజయాలను నిర్ణయించేది జనసేన మాత్రమే అవుతుంది. వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసిపి విజయం సాధించడానికి జనసేన టిడిపితో పొత్తు పెట్టుకోకపోతే సరిపోతుందనేది విశ్లేషకుల అంచనా. టిడిపి, జనసేన కలిసి పోటీ చేయకపోతే వైసిపి విజయం ఖాయం కావచ్చు. అది గ్రహించే పవన్ కల్యాణ్ చంద్రబాబును ఒత్తిడిలోకి నెట్టారని భావించవచ్చు. మొత్తంమీద, చంద్రబాబును పవన్ కల్యాణ్ ఇరకాటంలో పెట్టారు. ఒకవేళ వైసిపి విజయం సాధిస్తే చంద్రబాబు నిందలు మోయాల్సి వస్తుంది.

click me!