విశాఖ ఉక్కు: పవన్ కల్యాణ్ కు రాజకీయ చిక్కులు ఇవీ...

First Published | Mar 2, 2021, 8:36 AM IST

విశాఖ ఉక్కు విషయంలో బీజేపీ నేతల పరిస్థితే అయోమయంగా ఉంటే... వారితో జతకట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ పరిస్థితి మరింత ఇరకాటంలో పడింది. ఆయన ఇప్పటికే అమరావతి విషయంలో వెనక్కి తగ్గారు. ఇప్పుడు విశాఖ ఉక్కు విషయంలో ఏమీ మాట్లాడలేక అసలు పొత్తు ఎందుకు పెట్టుకున్నానురా బాబు అని తటపటాయించే పరిస్థితి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు బాగా వేడి మీద్ద ఉన్నాయి. ఒక పక్క ఇప్పుడే ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు, రాబోతున్న పుర పోరు కాక రేపుతుండగా మరోపక్క సెంటిమెంటు అంశమైన విశాఖ ఉక్కు తెర మీదకు వచ్చింది. విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ సెంటిమెంటు రగలడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ దాని చుట్టూనే తిరుగుతున్నాయి.
undefined
రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అంశాన్ని భుజానికెత్తుకొని తమ రాజకీయాన్ని సాగిస్తున్నాయి. "విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" అనే పాత నినాదాన్ని పైకెత్తుకుని రాజకీయాన్ని మొదలుపెట్టాయి. విశాఖ ఉక్కు పరిశ్రమను సాధించడానికి ఎంత స్థాయిలో ఉద్యమాలు జరిగాయో, భూముల సేకరణప్పుడు ఎంతలా అప్పటి అధికారులు, రాజకీయ నాయకులూ కష్టించారో అందరికి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే సెంటిమెంటు అంశం అవడంతో ప్రజలంతా దీనికి కనెక్ట్ అవుతున్నారు కూడా.
undefined

Latest Videos


అన్ని రాజకీయ పార్టీల్లోకెల్లా ఈ విషయం వల్ల అత్యంత ఇబ్బందిపడుతుంది మాత్రం బీజేపీ. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కారు ప్రైవేటీకరణకు మొగ్గు చూపడంతో ఎటు పాలుపోక మిగిలిపోయారు రాష్ట్ర కమలనాథులు. వారు మొన్న ఢిల్లీ వెళ్లి ఈ విషయమై కేంద్రం దగ్గర ప్రస్తావించబోయినప్పుడు వారికి ఎదురైన అనుభవం మనందరికీ తెలిసిందే.
undefined
విశాఖ ఉక్కు విషయంలోబీజేపీ నేతల పరిస్థితే అయోమయంగాఉంటే... వారితో జతకట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ పరిస్థితి మరింత ఇరకాటంలో పడింది. ఆయన ఇప్పటికే అమరావతి విషయంలో వెనక్కి తగ్గారు. ఇప్పుడు విశాఖ ఉక్కు విషయంలో ఏమీ మాట్లాడలేక అసలు పొత్తు ఎందుకు పెట్టుకున్నానురా బాబు అని తటపటాయించే పరిస్థితి వచ్చింది. సరే ప్రస్తుతానికి ఆ అంశం గురించి మాట్లాడకుందా ఉందామా అంటే ముంచుకొస్తున్న ఎన్నికలు ఆయనను ప్రశాంతంగా ఉండనివ్వడంలేదు.
undefined
తిరుపతి ఉపఎన్నిక విషయాన్నిపక్కనబెడితే.... ముంచుకొస్తున్న మునిసిపల్ ఎన్నికలు పవన్ కళ్యాణ్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి విశాఖలో బలమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన గాజువాక సీట్ నుంచి సైతం పోటీ చేసారు. విశాఖ లోక్ సభ సీటులో సైతం గణనీయంగా ఓట్లను సాధించగలిగింది జనసేన. ఆయన గాజువాకలో ఓడినప్పటికీ... అది స్వల్ప తేడాతో మాత్రమే.
undefined
ఇక ప్రస్తుత విశాఖ ఉక్కు ఉద్యమం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి ఎటూ పాలుపోని పరిస్థితి. ఇంకో వారం రోజుల లోపే ఆయన విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ దఫా మునిసిపల్ ఎన్నికల్లో అక్కడ బలంగా సీట్లు సాధించి తానేమిటో నిరూపించుకోవాలని అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం కంకణం కట్టుకుందని తేలిన నేపథ్యంలో ఆయన విశాఖలో ఏమి మాట్లాడుతారనేది వేచి చూడాలి. మొత్తానికి బీజేపీతో పొత్తు జనసేనానికి మేలు కన్నా నష్టాన్ని ఎక్కువగా చేస్తున్నట్టుగా కనబడుతుంది.
undefined
click me!