విశాఖ ఉక్కు: చిక్కుల్లో పవన్ కల్యాణ్, చంద్రబాబుపై వైఎస్ జగన్ పైచేయి

First Published Feb 20, 2021, 11:48 AM IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత వైఎస్ జగన్ కాస్తా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో పైచేయి కోసం టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో పోటీ పడుతున్నాయి. ఇతర పార్టీలు కూడా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఈ పోరాటంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పైచేయి సాధించినట్లు కనిపిస్తున్నారు.
undefined
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత వైఎస్ జగన్ కాస్తా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నారు. ఆ ఫ్యాక్టరీని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిన దక్షిణ కొరియా సంస్థ పోస్కో ప్రతినిధులు వైఎస్ జగన్ ను కలిశారని, పోస్కోతో జగన్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తూ వచ్చారు. పైగా, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ జగన్ నోరెత్తరని నిందిస్తూ వచ్చారు.
undefined
వైఎస్ జగన్ మాత్రం వ్యూహాత్మకంగా ముందుకు కదిలారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. వైసీపీ సభ్యులు ఉక్కు కర్మాగారం సమస్యను పార్లమెంటులోనూ ప్రస్తావించారు.
undefined
తెలుగుదేశం పార్టీ నాయకుడు పల్లా శ్రీనివాస్ నిరాహార దీక్ష చేయడం, దాన్ని పోలీసులు భగ్నం చేయడం, ఆయనను ఆస్పత్రిలో చేర్చడం వరకు టీడీపీ బాగానే పనిచేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పల్లా శ్రీనివాస్ ను చంద్రబాబు పరామర్శించి, వైఎస్ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు జగన్ ను నిందించడం తప్ప కేంద్ర ప్రభుత్వంపై ఆయన పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు.
undefined
ఆ తర్వాతనే వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. విశాఖ పర్యటనలో ఆయన స్పష్టమైన వైఖరి ప్రకటించారు. ఆందోళన చేస్తున్న కార్మిక సంఘాల నాయకులు ఆయనను కలిశారు. తాను పోస్కో ప్రతినిధులను కలిసిన మాట వాస్తవమేనని, అయితే రాష్ట్రంలోని వేరే చోట్ల ఉక్కు కర్మాగారం పెట్టాలని సూచించానని, అందుకు తగిన ప్రాంతాలను కూడా వారికి చెప్పానని, కడప అయితే బాగుంటుందని కూడా వారికి చెప్పానని ఆయన వివరించారు. దాంతో జగన్ స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు సంకేతాలు వెళ్లాయి
undefined
అంతే కాకుండా, విశాఖ ఉక్కు కర్మారాగాన్ని ప్రైవేటీకరించడానికి తాను అంగీకరించబోనని కూడా స్పష్టం చేశారు. తాజాగా, విజయసాయి రెడ్డి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా టీడీపీపై ఘాటుగా విరుచుకుపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రక్రియ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ప్రారంభమైందని, అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతి దాన్ని వ్యతిరేకించలేదని ఆమె చెప్పారు.
undefined
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చంద్రబాబు ప్రధాని మోడీకి ఎందుకు లేఖ రాయలేదని jరోజా అడిగారు. తమ నేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ తీరుపై వైసీపీ నేతలు మూకుమ్మడిగా విమర్శల దాడి చేస్తున్నారు. వాటిని తిప్పికొట్టే పరిస్థితిలో కూడా టీడీపీ నాయకులు లేరు.
undefined
ఇకపోతే, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటికరణ ప్రక్రియ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మింగుడు పడని వ్యవహారంగా మారింది. బిజెపితో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్ చిక్కుల్లో పడ్డారనే చెప్పాలి. అయితే, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఆపేయాలని ఆయన కేంద్రం పెద్దలను కోరారు. విజ్ఞప్తి చేయడం తప్ప పోరాటం చేయలేని స్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నారు. ఈ స్థితిలో ఆయనపై కూడా వైసీపీది పైచేయి అయింది.
undefined
విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వం పరిధిలోది. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి, టీడీపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఉవ్విళ్లూరుతున్న బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజుకు కూడా సమస్యగానే మారింది. బిజెపి రాష్ట్ర నాయకులు కూడా కేంద్రం పెద్దలకు వినతులు చేసుకున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయంతో సోము వీర్రాజు కూడా ఆత్మరక్షణలో పడ్డారని చెప్పవచ్చు.
undefined
click me!